Breaking News

టార్గెట్ 150.. ఇప్పటి వరకూ 129 మంది పిల్లలకు తండ్రైన రిటైర్డ్ టీచర్!


ఓ వ్యక్తి ద్వారా ఏకంగా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. అంతేకాదు, తన లక్ష్యం 150 మంది పిల్లలకు తండ్రి కావడమేనని, ఆ తర్వాత వీర్యదానం చేయనని అంటున్నాడు. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానానికి చట్టాలు అనుమతిస్తాయి. యూకేకు చెందిన అనే వ్యక్తి (66) వీర్యదానం చేయడం ద్వారా 129 పిల్లలకు తండ్రి కాగా.. మరో 9 మంది త్వరలో పుట్టబోతున్నారు. తనకు 58 ఏళ్లు వచ్చినప్పటి నుంచి వీర్యం దానం చేస్తున్నానని, ఇందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువ మందికి వీర్యదానం చేసిన వ్యక్తినని చెప్పారు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత విరమించుకుంటానని క్లైవ్‌ తెలిపారు. అయితే, అయితే, క్లైవ్ జోన్స్ అధికారికంగా వీర్యదాత కాదు. బ్రిటన్‌ చట్టాల ప్రకారం వీర్యదాత గరిష్ట వయస్సు 45 ఏళ్లు. దీంతో ఫేస్‌బుక్‌ ద్వారా సంప్రదించి ఉచితంగా వీర్యదానం చేస్తున్నారు. యూకేలోని చాలా ఆస్పత్రుల్లో వీర్యాన్ని అమ్ముతున్నారని వివరించారు. ఒకరికి ఆనందాన్ని ఇచ్చి, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ పేర్కొన్నారు. పదేళ్ల కిందట ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన తరువాత సంతానం లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. డెర్బీలోని చడ్సేడెన్‌లో నివాసం ఉండే క్లైవ్ జోన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ‘‘నాకు వచ్చే మెసేజ్‌లు, తల్లులతో ఉన్న శిశువుల ఫోటోలను చూస్తే ప్రజలు మరింత అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.. ఇలా వచ్చిన ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.. ఒకసారి అమ్మమ్మ తన మనవరాలికి కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేసింది’’ అన్నారు. ఇప్పటి వరకూ వీర్యదానం ద్వారా పుట్టిన 129 మంది పిల్లల్లో 20 మందిని కలిశానని చెప్పారు. అయితే, యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ.. క్లైవ్‌కు హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా బ్రిటన్‌లో వీర్యదానం, కొనుగోలు వంటివి లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వీటిని ఉల్లంఘించడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వైద్య, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అథారిటీ అధికార ప్రతినిధి అన్నారు.


By January 28, 2022 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-man-clive-jones-helps-father-129-children-by-donating-sperm-for-free-using-facebook/articleshow/89169014.cms

No comments