Breaking News

Omicron ఢిల్లీలో తొలి కేసు.. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్


దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఢిల్లీలో మొదటి కేసు నమోదయ్యింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్టు ఢిల్లీ అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో కేసులు ఐదుకు చేరాయి. విదేశాల నుంచి వచ్చిన 17 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వీరిలో 12 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. 12 నమూనాలను పరీక్షించగా.. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో బయటపడిందని అన్నారు. తొలి రెండు కేసులు కర్ణాటకలో నమోదుకాగా.. శనివారం గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారణ అయ్యాయి. మరికొంత మంది అనుమానితుల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,26,064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,895 కేసులు బయటపడ్డాయి. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,918 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటి, ఆ రేటు 98.35 శాతానికి చేరింది. కొవిడ్‌ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ ఈ మేరకు కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఒడిశా, మిజోరం,జమ్ముకశ్మీర్‌లకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శనివారం లేఖలు రాశారు.


By December 05, 2021 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/first-covid-omicron-case-in-delhi-tanzania-returnee-tests-positive/articleshow/88102805.cms

No comments