Breaking News

బెంగళూరులో ఐదుగురికి ఒమిక్రాన్.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన


వేరియంట్ కేసులను గుర్తించడంతో కర్ణాటక సహా దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఇద్దరికి సోకినట్లు కేంద్రం ధ్రువీకరించగా.. వీరిలో ఒకరు విదేశీయుడు కాగా... మరొకరు కర్ణాటకకు చెందిన డాక్టర్. తాజాగా, వైద్యుడితో కాంటాక్ట్ అయిన మరో ఐదుగురికి కూడా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. అయితే, ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి చెప్పడం గమనార్హం. ఆయనతో కాంటాక్ట్ అయిన వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలిందని మంత్రి చెప్పారు. ఈ ఐదుగురూ డాక్టర్లేనని తెలిపారు. వీరిలో ఇద్దరు ప్రైమరీ కాంటాక్టులు కాగా.. ముగ్గురు సెకండరీ కాంటాక్టులని.. వారికి నవంబర్ 22, 25 తేదీల్లో వీరికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలిందన్నారు. ఈ ఆరుగుర్నీ బెంగళూరులోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా వీరందరూ ఆరోగ్య పరమైన సమస్యలు లేవని.. లక్షణాలు మైల్డ్‌గానే ఉన్నాయని మంత్రి తెలిపారు. ఒమిక్రాన్‌గా తేలిన డాక్టర్‌కు ఆయాసం, జ్వరం ఉండటంతో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందని.. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారని కర్ణాటక మంత్రి వెల్లడించారు. ఆయనలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉందన్నారు. అనుమానంతో జినోమిక్ సీక్వెన్స్‌కు పంపగా.. ఒమిక్రాన్ అని తేలిందన్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి దుబాయ్ మీదుగా బెంగళూరు వచ్చాడని మంత్రి తెలిపారు. ఆయనకు 24 మంది ప్రైమరీ కాంటాక్టులు, 240 సెకండరీ కాంటాక్టులు ఉన్నాయని.. వారందరికీ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ అని వచ్చిందని కర్ణాటక ఆరోగ్య మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయిన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అతడు రెండు డోస్‌ల పూర్తిస్థాయి టీకా తీసుకోగా.. స్వల్ప లక్షణాలు కనిపించాయి. దీంతో అతడిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత ఓ ప్రయివేట్ ల్యాబొరేటరీలో పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ వచ్చిందని, తర్వాత అతడు దుబాయ్‌ వెళ్లిపోయాడని చెప్పారు.


By December 03, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-doctor-includes-5-contacts-test-positive-for-covid-omicron-in-bangalore/articleshow/88063002.cms

No comments