Breaking News

అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు.. కాలిఫోర్నియా వ్యక్తికి పాజిటివ్


తమ దేశంలో తొలి కేసు నమోదయినట్టు అమెరికా బుధవారం ప్రకటించింది. కాలిఫోర్నియా వ్యక్తిలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేసుకున్న ఈ వ్యక్తి.. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవలే వచ్చినట్టు పేర్కొంది. అయితే, బాధితుడిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించింది. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటానికి ముందు అమెరికా అంటువ్యాధుల విభాగం చీఫ్ మాట్లాడుతూ.. అందరూ అప్రమత్తవ్వాల్సిన సమయం ఇదని అన్నారు. వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్‌లు, మాస్క్‌లను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చని తెలిపారు. ఇక, అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటన ప్రకారం.. దక్షిణాఫ్రికా నుంచి నవంబరు 22న వచ్చిన బాధితుడికి పాజిటివ్ రాగా.. అతడితో కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు నిర్వహించామని తెలిపింది. వీరందరికీ నెగెటివ్ వచ్చిందని పేర్కొంది. నవంబరు 29న బాధితుడికి పాజిటివ్ వచ్చిందని, నాకు తెలిసినంత వరకూ అతడు బూస్టర్ డోస్ తీసుకోలేదని ఫౌచీ అన్నారు. వేరియంట్‌కు సంబంధించి కొన్ని ప్రారంభ నివేదికలు తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని తెలిపాయి.. అయితే, మరింత లోతైన సమాచారం లభించే వరకు వీటిని పట్టించుకోమని ఫౌచీ హెచ్చరించారు. ‘ఈ రోగి తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నా వాస్తవానికి లక్షణాలు పెరుగుపడుతున్నట్లు మేము భావిస్తున్నాం’ అని అతను చెప్పారు. దక్షిణాఫ్రికా వంటి దేశాల వద్ద ఉన్న చాలా సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. రాబోయే వారాలు, నెలల్లో ఈ సమాచారాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ‘ఒమిక్రాన్ సోకిన బాధితుడు పూర్తిస్థాయి టీకా తీసుకున్నాడు.. బూస్టర్ డోస్ చాలా మంచి ఆలోచన.. ఎందుకంటే ఓ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు పెరుగుతాయి.. దీని వల్ల కొత్త వేరియంట్లను అడ్డుకోవచ్చు’ అన్నారు. ‘డెల్టా వేరియంట్ వంటి వేరియంట్‌లతో మా అనుభవం ఏమిటంటే, డెల్టాను వ్యాక్సిన్ ప్రత్యేకంగా టార్గెట్ చేయనప్పటికీ, తగినంత స్థాయిలో రోగనిరోధక ప్రతిస్పందనను పొందినప్పుడు వైరస్ తీవ్రత నుంచి రక్షణను పొందుతారు’ అని పేర్కొన్నారు. ఇక, ఆఫ్రికా దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని సమర్దించుకున్నారు. అయితే, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెర్రస్ మాత్రం దీనిని అనాలోచిత నిర్ణయమని విమర్శించారు.


By December 02, 2021 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/first-omicron-case-in-us-who-returned-form-south-africa-on-november-22nd/articleshow/88042865.cms

No comments