Breaking News

పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్.. భారత్ బయోటెక్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్


15 నుంచి 18 ఏళ్లలోపున్న వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వయస్సు పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. చిన్నారులపై చేసిన 3 దశల ప్రయోగాల ఫలితాలను భారత్ బయోటెక్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీకి నివేదించింది. ఫలితాలను విశ్లేషించిన కమిటీ.. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేయనున్నారు. భారత్‌లో పెద్దలతోపాటు పిల్లలకు వేయడానికి అనుమతించి రెండో కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్. 2021 ఆగస్టులో 12 ఏళ్లు పైబడిన వారికి వేయడం కోసం జూడూస్ కాడిలా‌కు చెందిన ‘జైకోవి-డి’కి ప్రభుత్వ అనుమతి లభించింది. డెల్టా వేరియంట్‌తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో దేశంలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందనే నమ్మకంతో ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడింది. వీరితోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసులను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాల్లో కేసుల కట్టడికి చర్యలు కూడా తీసుకుంటోంది. ఇదే సమయంలో మూడేళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు కోవావాక్స్ టీకాను వచ్చే ఆరు నెలల్లో విడుదల చేస్తామని పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గత వారం ప్రకటించింది. ప్రయోగ దశలో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తోందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అన్నారు. కోవావాక్స్ అనేది యూఎస్ ఆధారిత నోవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ వెర్షన్ అని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయని, పిల్లలను కరోనా వైరస్ నుంచి కాపాడతాయనడానికి తగినంత డేటా ఉందని చెప్పారు. కోవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో అనుమతులు ఇచ్చింది.


By December 26, 2021 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-biotech-gets-permission-to-give-covaxin-for-children-from-dcgi/articleshow/88500855.cms

No comments