ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలో మంగళవారం తెల్లవారుజామున భారీ సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా నమోదయినట్టు తెలిపింది. తీవ్రమైన భూకంపం కారణంగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు నుసా టెంగ్‌గెరా ప్రావిన్సుల్లో ఫ్లోరేస్ దీవికి ఉత్తరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం భీభత్సం సృష్టించింది. భూకంపం గురించి స్థానికుడు ఒకరు మాట్లాడుతూ.. నేను బయటే ఉన్నాను.. భయంతో జనం పరుగులు తీస్తున్నారు.. నాకు భయంగానే ఉందని తెలిపారు. అయితే, భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టం గురించి తక్షణమే ఎటువంటి సమాచారం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఇప్పటికీ సురక్షితంగా ఉందని, ఎటువంటి నష్టం జరగలేదని తూర్పు ఫ్లోరేస్ జిల్లా అధికారి అంటినియస్ హ్యుబర్టస్ గెగె హడ్జన్ తెలిపారు. కానీ, భూకంపం తర్వాత జనం ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. అయితే, భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయపడొద్దని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ‘భూకంపం వచ్చినప్పుడు నేను నా ఫోన్‌ని చెక్ చేస్తున్నాను.. 30 సెకన్ల పాటు భూమి కంపించింది.. ఇది చాలా బలంగా ఉంది’ అని ఈశాన్య సులవేసికి చెందిన అల్వాన్ అనే వ్యక్తి చెప్పాడు. సునామీ హెచ్చరికలు జారీచేసిన ప్రాంతాల్లో సులవేసి కూడా ఉంది. ఫ్లోరెస్‌లో సముద్రానికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మౌమెరే పట్టణానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 1,000 కిలోమీటర్ల పరిధిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన తర్వాత భూకంపం వల్ల ఇకపై సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. జపాన్ నుంచి ఆగ్నేయాసియా.. పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉన్న భూకంప కార్యకలాపాలకు కారణమయ్య టెక్టోనిక్ ప్లేట్స్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ స్థానంలో ఇండోనేషియా ఉండటం వల్ల తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. 2004 డిసెంబరు 26 ఇండోనేషియాలో 9.1 తీవ్రత భారీ భూకంపం సంభవించి సునామీకి దారితీసింది. ఈ సునామీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఇండోనేషియాలోనే 1.70 లక్షల మంది చనిపోయారు.
By December 14, 2021 at 10:44AM
No comments