Breaking News

వరుడు అక్కడ.. వధువు ఇక్కడ.. ఆన్‌లైన్‌ పెళ్లికి గ్రీన్ సిగ్నల్


కోవిడ్ వైరస్ జీవన గమనాన్ని మార్చేసింది. వ్యక్తుల సాధారణ జీవితంపై చాలా ప్రభావం వేసింది. బౌతిక దూరం నుంచి... వర్క్ ఫ్రమ్ హోం వరకూ అన్నింట్లోని మార్పులు వచ్చేశాయి. అన్నీ ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఈ మార్పు పెళ్లి చేసుకునే విధానంలో కూడా వచ్చింది. మేళతాళాలు, మంత్రాలు, అయినవాళ్లు.. .. భోజనాలు.. వివాహం అంటే ఇన్ని ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒక దగ్గర లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు. అలా ఆన్‌లైన్ పెళ్లికి కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒమిక్రాన్ వల్ల పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డ ఓ జంటకు కేరళ హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. లాయర్ రింటు థామస్, అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌ల పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా వారి పెళ్లి జరగలేదు. ఒమిక్రాన్ వల్ల బ్రిటన్‌లో ప్రయాణాలపై విధించారు. చదువు నిమిత్తం బ్రిటన్‌లో ఉన్న నాయర్ ఇక్కడకు రాలేకపోయారు. దాంతో వారి పెళ్లికి ఆటంకం ఏర్పడింది. ఈ పరిణామంతో రింటూ కోర్టును ఆశ్రయించింది. ఆన్‌లైన్‌లో తమ పెళ్లికి అనుమతించేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జడ్జ్ జస్టిస్ ఎన్. నగరేశ్ ఈ వినతిని అంగీకరించారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ పెళ్లికి హై కోర్టు అనుమతులు ఇచ్చిందని.. ఇప్పుడూ కూడా దానిని అమలు చేయవచ్చని చెప్పారు. డేట్ ఫిక్స్ చేసిన ఆన్‌లైన్ పెళ్లికి చట్ట ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్ వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో శుభకార్యాలపై అనేక ఆంక్షలు విధించారు. పెళ్లికి హాజరయ్యే వారు కరోనా నిబంధనలు పాటించడంతో పాటు.. కొంతమంది మాత్రమే ఆ పెళ్లికి హాజరవ్వాలనే నిబంధనలు అమలయ్యాయి. దాంతో చాలా పెళ్లిళ్లు సాదా, సీదాగానే జరిగాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తులు వేర్వేరు వేర్వేరు చోట్ల చిక్కుకుపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వివాహం చేసుకుని ఒకటైన జంటలు ఉన్నాయి. దీంతో గతంలో కూడా కేరళలో ఆన్‌లైన్‌ పెళ్లిళ్లకి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దానిపై కోర్టు సానుకూలంగా స్పందించి పెళ్లిళ్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చింది.


By December 24, 2021 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-high-court-green-signal-to-online-marriage/articleshow/88467982.cms

No comments