Breaking News

రాళ్లు వేయ‌కండి.. ఆచి తూచి మాట్లాడ‌క‌పోతే ఇండ‌స్ట్రీకే న‌ష్టం : విష్ణు మంచు


తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెస్‌మీట్‌కు తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా విష్ణు మాట్లాడుతూ ‘‘ప్రతాని రామకృష్ణా గౌడ్‌, గురురాజ్‌గారి మీదున్న అభిమానంతో వ‌చ్చాను. నాకు ప్రాంతీయంగా మాట్లాడ‌టం తెలియ‌దు. మ‌నం అందరం తెలుగువాళ్లం. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉండాలి. తెలుగువాళ్ల ఆత్మ గౌర‌వం ఎక్క‌డ త‌గ్గినా మ‌నం ఒక‌ట‌వ్వాలి. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులకు థాంక్స్‌. వాళ్లు మంచి పాల‌సీల‌తో ఇండ‌స్ట్రీని కాపాడుతున్నారు. ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లంద‌రూ అద్దాల మేడ‌లో ఉండేవాళ్లం. మేం ఎవ‌రిపైనా రాళ్లు విస‌ర‌కూడ‌దు. మేం మాట్లాడే విష‌యాల వ‌ల్ల ఇత‌రులు కూడా మాపై రాళ్లు విస‌ర‌కూడ‌దు. ఎందుకంటే, మేం రాళ్లు విసిరినా.. వేరే వాళ్లు రాళ్లు విసిరినా న‌ష్టం మాకే. మేం ఇచ్చే స్టేట్‌మెంట్ ఏదైఆన ఆచి తూచి ఇవ్వాలి. ప‌వ‌ర్‌లో ఉన్న‌వాళ్లు, స్టార్స్ అయినా ఇచ్చే స్టేట్‌మెంట్స్ ఇండ‌స్ట్రీపై ప‌డుతుంది. కాబ‌ట్టి ఇండ‌స్ట్రీని గుర్తు పెట్టుకుని ఐక‌మ‌త్యంగా ఉంటూ, అంద‌రి త‌ర‌పున స్టేట్‌మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వ‌ని ప‌క్షంలో వ్య‌క్తిగ‌తంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నాన‌ని చెప్పుకోవాలి’’ అన్నారు. రామ‌కృష్ణా గౌడ్, గురురాజ్ ఇద్ద‌రూ త‌న‌కు మా ఎన్నిక‌ల్లో అండ‌గా నిల‌బ‌డి విలువైన స‌ల‌హాల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా చాలా కాలంగా ఉన్న స్నేహం కార‌ణంగా.. వ్య‌క్తిగ‌తంగా తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ప్రెస్‌మీట్‌కు వ‌చ్చిన‌ట్లు విష్ణు మంచు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత విష్ణు మంచు న‌టీన‌టుల కోసం కార్య‌క్ర‌మాల‌ను చ‌క‌చకా పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోని మ‌హిళా న‌టీన‌టుల స‌మ‌స్య‌ల కోసం ఓ ప్ర‌త్యేక‌మైన సెల్‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా, హైద‌రాబాద్ సిటీలోని ప్రైవేటు హాస్పిట‌ల్స్‌తో ట్రీట్‌మెంట్ కోసం టై అప్ అయ్యారు.


By December 04, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishnu-manchu-latest-speech-on-telangana-film-chamber-of-commerce/articleshow/88084050.cms

No comments