ఐటెం సాంగ్ అనగానే సమంత ఫీలింగ్స్.. ఆ మాటతో గ్రీన్ సిగ్నల్! సీక్రెట్స్ రివీల్ చేసిన సుకుమార్
గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ .. తన క్రియేటివిటీకి మరింత పదును పెట్టి అదే కోణంలో ‘పుష్ప’ సినిమా రూపొందించారు. అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతుండగా.. చేసిన స్పెషల్ సాంగ్ రచ్చకు తెరలేపింది. ఈ సాంగ్‌పై పలు వివాదాలు నడుస్తున్నా కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. సుకుమార్ స్టైల్ టేకింగ్, ఐటెం సాంగ్‌లో సమంత గ్లామర్ చూసి హుషారెత్తిపోతున్నారు ఆడియన్స్. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊ అంటావ మావ ఉ ఉ అంటావా మావ.. అంటూ సాగిన ఈ పాటలో సమంత అందాల ప్రదర్శన హద్దులు దాటిందనే వారు చాలామందే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన సమంత వెండితెరపై ఓ స్పెషల్ సాంగ్ చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ విడుదల అనంతరం శనివారం రోజు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన సుకుమార్.. పుష్ప విశేషాలతో పాటు సమంత ఐటెం సాంగ్ సీక్రెట్స్ బయటపెట్టారు. సమంత తొలిసారి ఐటెం సాంగ్ చేసింది కదా.. వెంటనే ఒప్పుకుందా? అనే ప్రశ్నపై బదులిచ్చారు సుకుమార్. ఈ పాట గురించి సమంతకు చెప్పగానే తనకు కరెక్ట్ కాదని ఆమె చెప్పిందని తెలిపారు. అయితే నటిగా ఇది మీకు కొత్తగా ఉంటుందని, ఈ సాంగ్ మీకు బాగా యాప్ట్ అవుతుందని చెప్పి తానే సమంతను ఒప్పించినట్లు సుక్కు ఓపెన్ అయ్యారు. ‘రంగస్థలం’సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా సమంత 'నో' చెప్పిందని, ఆ తర్వాత తన మాటపై నమ్మకంతో ఓకే చెప్పి ఈ సాంగ్ చేసిందని సుకుమార్ చెప్పారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ''ఆర్య, ఆర్య 2'' సినిమాల తర్వాత 'పుష్ప' ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. కూలీ వాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడిగా ఎలా ఎదిగాడనే కథాంశంతో కథ నడిపించారు. ఇక ఈ సినిమాకు రెండో భాగంగా 'పుష్ప ది రూల్' పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కనుంది.
By December 19, 2021 at 08:36AM
No comments