Breaking News

‘పుష్ప ది రైజ్‌’ వరల్డ్ వైజ్ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.... మ‌రో మైలు రాయి ట‌చ్ చేసిన అల్లు అర్జున్‌


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. ఈ సినిమా కోసం బ‌న్నీ ప‌డ్డ క‌ష్టం. త‌న చేంజోవ‌ర్‌, సుక్కు టేకింగ్ గురించి అవ‌గాహ‌న ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే సినిమా వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి క‌లెక్ష‌న్స్‌లో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. సినిమాలో డైలాగ్ ఉన్నట్లు త‌గ్గేదే లే అనేలా సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేపుతోంది. మూడో రోజు కూడా ది రైజ్ రూ.40.20 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో సినిమా మొత్తంగా రూ.129.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అంటే బ‌న్నీ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను హృద‌యాల‌ను కొల్ల‌గొట్టి వంద కోట్ల రూపాయ‌ల క్ల‌బ్‌లో చేరారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా తొలి రోజున రూ.52.80 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజు రూ.36.40 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేసిన‌ట్ల‌య్యింది. ఇక మూడో రోజు రూ.40.20 కోట్ల‌ను సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే మూడో రోజున.. నైజాం.. రూ.7.1 కోట్లు సీడెడ్ .. రూ.2.55 కోట్లు గుంటూరు .. 64 ల‌క్ష‌లు కృష్ణ 80 .. ల‌క్ష‌లు నెల్లూరు .. 42 ల‌క్ష‌లు వెస్ట్ .. 60 ల‌క్ష‌లు ఈస్ట్ .. 85 ల‌క్ష‌లు ఉత్త‌రాంధ్ర ..1 కోటి 35 ల‌క్ష‌లు అంటే మొత్తంగా మూడో రోజు రూ.14కోట్ల 31 ల‌క్ష‌లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.24.90 కోట్లు, రెండో రోజున 13.68 కోట్లు, మూడో రోజున 14.31 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. అంటే మొత్తంగా మూడో రోజుల‌కు క‌లిపి రూ.52.89 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. స్టేజ్ వైడ్‌గా చూస్తే ఈ చిత్రానికి మూడో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.22.30 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.3.50కోట్లు, కేర‌ళ రూ.2.70 కోట్లు, రెస్టాప్ ఇండియా రూ.7.90 కోట్లు, త‌మిళనాడులో రూ. 3.70 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవర్ సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రీమియర్స్ $543,603 (293 Locs) Day 1 $430,872 (370 Locs ) Day 2 $390,151 (370 Locs) Day 3 $238,045 (325 Locs) టోటల్ గ్రాస్ : $1,602,671 అంటే మన కరెన్సీలో రూ.12.20 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు సోమ‌వారం నుంచి ఎంతో కీల‌కం.. ఎందుకంటే ఇక్క‌డే ఏ సినిమా అయినా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను తెచ్చి పెడుతుందా? లేదా? అని డిసైడ్ అయిపోతుంది. మ‌రి పుష్పరాజ్ వ‌సూళ్ల ప‌రంగా సోమ‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి స‌త్తా చూపుతాడో చూడాలి.


By December 20, 2021 at 01:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-pushpa-the-rise-ww-collections/articleshow/88387209.cms

No comments