Breaking News

అదే మాదిరిగా వ్యాపిస్తే దేశంలో రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరిక!


దేశంలో క్రమంగా పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 11 రాష్ట్రాల్లో 101 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు భారత్‌లోనూ నెలకుంటే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ హెచ్చరించారు. యూకే తరహా పరిస్థితులు ఏర్పడితే భారత్‌లో రోజుకు 14 లక్షల కేసులు, ఫ్రాన్స్‌లా అయితే రోజుకు 13 లక్షల కేసులు నిర్దారణవుతాయన్నారు. ‘యూకేలో వ్యాప్తి స్థాయిని పరిశీలిస్తే భారత్‌లో ఇలాగే మన జనాభాను బట్టి ప్రతిరోజూ 14 లక్షల కేసులు నమోదవుతాయి.. ఫ్రాన్స్‌లో రోజుకు 65,000 కేసులు బయటపడుతున్నాయి.. అదే స్థాయిలో వ్యాప్తి చెందితే భారత్‌లో మన జనాభాను బట్టి ప్రతిరోజూ 13 లక్షల కేసులు నమోదవుతాయి.. యూకేలో రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. శుక్రవారం అక్కడ 88,042 మంది కొత్తగా వైరస్ బారినపడడగా.. వీటిలో ఒమిక్రాన్ కేసులు 2.4 శాతం’ అని తెలిపారు. ఐరోపాలో 80 శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినా డెల్టా వేరియంట్ ఉద్ధృతి తగ్గడం లేదని పాల్‌ అన్నారు. కాబట్టి అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు. తప్పనిసరిగా టీకా తీసుకోవడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్ల వాడాలని వీకే పాల్ పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో సమూహాలకు దూరంగా ఉండాలని పాల్‌ కోరారు. నూతన సంవత్సర వేడుకలను కొద్దిమంది సమక్షంలో జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గడచిన 20 రోజులుగా దేశంలో కొవిడ్‌ కేసులు 10వేలకు దిగువే నమోదవుతున్నా ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా బయటపడుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్‌ గుర్తు చేశారు. దక్షిణాఫ్రికాలో నమోదవుతున్న వాటిలో 98 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులేనని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. యూకే, డెన్మార్క్, నార్వేలో దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ కేసులు నమోదువుతున్నాయని చెప్పారు. ‘డెల్టా వ్యాప్తి తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఓమిక్రాన్ అధిగమించే అవకాశం ఉంది’ అని లవ్ అగర్వాల్ పరోక్షంగా హెచ్చరించారు. ట్రావెల్ హిస్టరీ లేని అతి తక్కువ మందికే ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని, దీని ఆధారంగా సామూహిక వ్యాప్తి మొదలైనట్టు నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు.


By December 18, 2021 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-warns-on-omicron-variant-spread-with-uk-and-france-parallel/articleshow/88351662.cms

No comments