Breaking News

RRR : హాట్ టాపిక్‌...సల్మాన్ ఖాన్‌ను కలిసి రాజమౌళి..మతలబేంటో?


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళినే ఇప్పుడు అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. కేవ‌లం టాలీవుడ్ మాత్ర‌మే కాదండోయ్ ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ కూడా.అందుకు కార‌ణం, ఆయ‌న డైరెక్ష‌న్‌లో రాబోతున్న మూవీ. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో న‌టీన‌టులు, హాలీవుడ్ స్టార్స్‌తో రూపొందించిన చిత్రం కావ‌డంతో పాటు బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రాబోతున్న చిత్రం. దీంతో అంద‌రూ అటెన్ష‌న్‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రో వైపు రాజ‌మౌళి త‌న ప‌నుల‌ను తాను పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేస్తూనే, ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్‌తో సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్‌గా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ను మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి శుక్ర‌వారం రోజున ప్ర‌త్యేకంగా క‌లిశారు.దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంత ప్ర‌త్యేకంగా స‌ల్లూ భాయ్‌ను జ‌క్క‌న్న ఎందుకు కలిశాడ‌నేది హాట్ టాపిక్‌గా మారింది. రాజ‌మౌళి, స‌ల్మాన్‌ఖాన్ క‌ల‌యిక వెనుక ఏమైనా ప్ర‌త్యేక కార‌ణాలున్నాయా? అని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఈ వ్య‌వ‌హారాన్ని రెండు ర‌కాలుగా చూడొచ్చున‌ని కొంద‌రు అంటున్నారు. ఎందుకంటే.. రాజ‌మౌళి త‌న RRR మూవీ ట్రైల‌ర్‌ను ముంబైలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని, ఆ వేడుక‌కు స‌ల్మాన్‌ఖాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డానిక‌నే వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిశార‌ని అంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం జ‌క్క‌న్న‌, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందేమోన‌ని కూడా గుస‌గుస‌లాడుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని, RRR త‌ర్వాత త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చేయ‌బోతున్నాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై జ‌క్క‌న్న అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. RRR విష‌యానికి వ‌స్తే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న RRR విడుద‌ల‌వుతుంది. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న్ పాయింట్‌తో రాజ‌మౌళి చేసిన సినిమా ఇది. బాలీవుడ్‌కి చెందిన‌ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియాభ‌ట్ స‌హా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


By November 20, 2021 at 08:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-director-rajamouli-met-salman-khan-in-hyderabad/articleshow/87810848.cms

No comments