Breaking News

Rakul : కండోమ్‌తో ర‌కుల్ ప్రీత్‌..ఎగ్జ‌యిట్ అవుతున్నానన్న బ్యూటీ!


ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో అగ్ర హీరోల‌తో జోడీ కట్టిన ఈ పంజాబీ పాల‌కోవా త‌మిళంలోనూ సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లోనూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది. వైవిధ్య‌మంటే అలా ఇలా కాదు.. ఓ ఇమేజ్ ఉన్న ఏ హీరోయిన్ చేయ‌ని సాహసం చేస్తుంద‌నే అనుకోవాలి. ఎందుకంటే ర‌కుల్ చేస్తున్న పాత్ర ఓ కండోమ్ టెస్ట‌ర్‌గా. ఇది నిజంగా ఆమె అభిమానుల‌కు షాకింగ్ న్యూసే. అయినా కూడా అలాంటి పాత్ర చేయాల‌నుకోవ‌డం నిజంగా ఆమె గొప్ప‌త‌న‌మే అంటున్నారు. తేజ‌స్ ప్ర‌భ విజయ్ దేవాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘ఛ‌త్రివాలి’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ర‌కుల్ రిలీజ్ చేసింది. ‘‘వాతావరణ సూచనలు లేకుండా ఈ వర్షం ఎప్పుడైనా కురుస్తుంది. మీ గొడుగును సిద్ధంగా ఉంచుకోండి’’ అనే విషయాన్ని తన ట్విట్టర్లో రాయడమే కాకుండా కండోమ్‌ను ప్యాకెట్‌ను ఓపెన్ చేస్తున్న‌ట్లు ర‌కుల్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఛ‌త్రివాలి సినిమా కోసం చాలా ఎగ్జ‌యిటింగ్‌గానూ ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు ర‌కుల్ ప్రీత్‌. అస‌లు ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయ‌డానికి ర‌కుల్ ఎలా ఒప్పుకుంద‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మ‌రి దీనికి ర‌కుల్ ఎలాంటి స‌మాధానం ఇస్తుందో చూడాలి. కానీ ఆమె డేరింగ్‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. దేదే ప్యార్ దే సినిమాలో తనకంటే రెట్టింపు వయసున్న అజయ దేవగణ్ పాత్రతో ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించిన రకుల్.. ఇప్పుడు కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో ఎలా మెప్పించ‌నుందో చూడాలి. ఇటీవ‌ల 31వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓవైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా ఉంది. సినిమాల్లోనూ ఇటు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా తెలుగులో ర‌కుల్ ప్రీత్‌ వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.


By November 14, 2021 at 07:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rakul-preet-singh-as-condom-tester-in-chhatriwali-first-look-released/articleshow/87692971.cms

No comments