Breaking News

Rakul Preet Singh : పెళ్లి గురించి రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ సమాధానం...జోతిష్కుడు చెప్పిందే నిజ‌మవుతుందా?


ఇటు ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న ఫిట్‌నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన సంగ‌తి విదితమే. ఇప్ప‌టికే 31 ఏళ్లు అయ్యిందిగా, ఇప్పుడు పెళ్లి గురించి అనౌన్స్ చేసిందంటే ఈమె త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌ని అందుక‌నే ఆమె అనౌన్స్‌మెంట్ చేసింద‌ని వార్త‌లు కూడా వినిపించాయి. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ త‌న పెళ్లి గురించి అస‌లు విష‌యాన్ని చెప్పి ఓ ర‌కంగా షాక్‌కు గురిచేసింది. అస‌లేం చెప్పింద‌నే వివ‌రాల్లోకి వెళితే, ప్ర‌స్తుతం ఈ పంజాబీ పాల‌కోవా..అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి థాంక్ గాడ్ అనే సినిమాలో న‌టించింది. ఆ సినిమా ప్ర‌మోష్స్ జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించి బాలీవుడ్ వర్గాలకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మాట‌ల సందర్భంలో త‌న పెళ్లిపై వినిపిస్తున్న వార్త‌ల‌పై రియాక్ట్ అయ్యారు. ‘త‌న ప్రేమ సంగ‌తిని అంద‌రికీ తెలియ‌జేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అదొక అంద‌మైన అనుభూతి. అంద‌రికీ చెప్పాల‌నిపించ‌డంతో చెప్పేశాను. అయితే పెళ్లికి ఇప్ప‌ట్లో తొంద‌రేమీ లేదు. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టాను’ అని చెప్పి తన పెళ్లికి ఇప్పుడేమీ తొంద‌ర‌ప‌డ‌టం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ డాల్. అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి వేణుస్వామి అనే తెలుగు జ్యోతిష్కుడు ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ పెళ్లి వ‌ర‌కు జాకీ భ‌గ్నానీ, ర‌కుల్ వెళ్ల‌ర‌ని, ఒక‌వేళ పెళ్లి చేసుకున్నా విడిపోతార‌ని.. ఓ కేసు విస‌యంలో ర‌కుల్ జైలుకు వెళ్లే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలిపారు. ఇప్పుడు త‌న పెళ్లిపై ర‌కుల్ స్పందించిన తీరు చూస్తుంటే వేణుస్వామి చెప్పిన‌ట్లే జ‌రుగుతుందా.. అస‌లు వీళ్లు పెళ్లి వ‌ర‌కు అడుగులేస్తారా? అని ర‌కుల్ ఫ్యాన్స టెన్ష‌న్ ప‌డుతున్నారు. 2009లో గిల్లి అనే క‌న్న‌డ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ఆ వెంట‌నే తెలుగుకి షిఫ్ట్ అయ్యింది. న‌టిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంటూ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంంటూ వ‌చ్చింది. కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో దాదాపు న‌టించారు. అలాగే ఆమె ఓవైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉంది. ఎఫ్ 45 అనే జిమ్ సెంట‌ర్‌ను కూడా ర‌కుల్ నిర్వ‌హిస్తోంది. అలాగే వీలునప్పుడల్లా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ హిందీ, తమిళ చిత్రాల్లో న‌టిస్తున్నారు. తెలుగులో రీసెంట్‌గా ఆమె న‌టించిన కొండపొలం మాత్ర‌మే విడుద‌లైంది.


By November 22, 2021 at 12:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rakul-preet-singh-shocking-comments-about-her-marriage/articleshow/87844361.cms

No comments