Breaking News

Prabhas : ప్ర‌బాస్ 24.. Project K క్రేజీ అప్‌డేట్‌..!


బాహుబ‌లిగా వెండితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసి తెలుగు సినిమా రేంజ్‌ను పెంచ‌డంలో భాగ‌మైన క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌. ఆ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ బాక్సాఫీస్ బాహుబలిగా మారాడు. వ‌రుస పాన్ ఇండియా సినిమాల్లో న‌టించ‌డానికే ఓకే చెప్పాడు. ఇప్పుడు ప్ర‌భాస్ లిస్టులో ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ప్ర‌భాస్ 24వ చిత్రం Project K. మ‌హాన‌టితో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లే కాదు.. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. పాన్ ఇండియా రేంజ్‌లో కాదు.. ప్ర‌భాస్ కోసం పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ సినిమా తీస్తున్నాన‌ని ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ చెప్పేశాడు. రీసెంట్‌గా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశారు. అమితాబ్ బచ్చ‌న్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు కూడా. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు అంటున్నారు. కాగా.. ఈ Project Kకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌బోతున్నాడ‌ని. ఇందులో నిజానిజాలేంటో తెలియ‌డం లేదు కానీ.. నెట్టింట మాత్రం వార్త చాలా బ‌లంగా వినిపిస్తోంది. ర‌జినీకాంత్ కాలా, క‌బాలి స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంతోష్ నారాయ‌ణ్ సంగీతాన్ని అందించారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ Project Kకు సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అంటే త‌న‌కు కెరీర్ ప‌రంగా ఎంత‌గానో హెల్ప్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీ ద‌త్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌నల్ మూవీగా Project K రూపొంద‌నుంది. ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న లేటెస్ట్ పీరియాడిక్ మూవీ రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌ని 14న విడుద‌ల‌వుతుంది. దీనికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న స‌లార్ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కాక మున‌నుపే ప్ర‌భాస్ త‌న 25వ చిత్రం స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నాడు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ వంటి చిత్రాల‌తో సెన్సేష‌న‌ల్ హిట్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు.


By November 23, 2021 at 09:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-project-k-latest-update/articleshow/87860921.cms

No comments