Breaking News

Megastar Chiranjeevi : దెయ్యం లుక్‌లో చిరంజీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతున్న మెగాస్టార్!


కెరీర్ ప్రారంభంలో దొంగ సినిమా చూసిన వారికి ‘గోలీమార్‌.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తారో.. ’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ను భ‌య‌పెట్ట‌డానికి మెగాస్టార్ దెయ్యంలా మారిపోతారు. మైకేల్ జాక్స‌న్ ఆల్బ‌మ్‌ను స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అప్ప‌ట్లో చేసిన ఈ సాంగ్ ఆడియెన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి దెయ్యం లుక్‌లో మ‌ళ్లీ క‌నిపించారు. ఎప్పుడూ న‌వ్వుతూ కూల్‌గా క‌నిపించే చిరంజీవి దెయ్యం లుక్‌ను చూస్తే పిల్ల‌లు జ‌డుసుకుంటారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఏదీ హార‌ర్ సినిమా లేదే. ఎందుకలా ఆయ‌న దెయ్యం లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌నే సందేహం రాక మాన‌దు. అయితే చిరంజీవి దెయ్యం లుక్‌.. సినిమా కోసం కాదండోయ్‌.. హాలోవీన్ సంద‌ర్భంగా ఆయ‌న వేసిన రియ‌ల్ గెట‌ప్‌. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆరున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటినా ఆయ‌న ఎంతో ఉత్సాహంగా పిల్ల‌ల‌తో పోటీ ప‌డుతూ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌డం ఆయ‌న ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమా షూటింగ్‌ను ఆయ‌న పూర్తి చేసేశారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. మ‌రోవైపు గాడ్‌ఫాద‌ర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే భోళా శంక‌ర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి చిరంజీవి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 11న లాంఛ‌నంగా ప్రారంభ‌మై, న‌వంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని త‌ర్వాత బాబి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌డానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పండ‌గేన‌ని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి న‌టించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డం ప‌క్కాగా క‌నిపిస్తోంది.


By November 01, 2021 at 09:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-halloween-look-goes-viral/articleshow/87452075.cms

No comments