Breaking News

Lakshmi Manchu : లక్ష్మీ మంచుపై అల్లు అర్జున్ పంచ్‌లే పంచ్‌లు... ల‌క్ష్మీ మంచు ఎలా రియాక్ట్‌ అయ్యిదంటే ?


టాలీవుడ్‌లో ల‌క్ష్మీ మంచు మాట్లాడే తెలుగుపై చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ట్రోలింగ్ వ‌చ్చాయి. ఆమె తెల‌గు ప‌దాల‌ను ప‌ల‌క‌డం వెనుక కార‌ణం అమెరికాలో ఎక్కువ రోజులు పెర‌గ‌డ‌మే. ఆమె తెలుగుపై ఇంగ్లీష్ ప‌దాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యాల‌ను ప‌క్క‌కు పెడితే, ల‌క్ష్మి తెలుగును బేస్ చేసుకుని ట్రోల‌ర్స్ చాలా వీడియోలు చేశారు. అయితే మ‌రోసారి ల‌క్ష్మీ మంచుపై ఓ హీరో సైలెంట్‌గా పంచ్ వేసేశారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా 2.0 యాప్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌లో ల‌క్ష్మీ మంచు కూడా పాల్గొన్నారు. ఇద్ద‌రూ స్టేజ్‌పై ఉన్న స‌మ‌యంలో ల‌క్ష్మీ మంచుని తెలుగులోనే మాట్లాడాల‌ని, అందుకు కార‌ణంగా ఆహా అనేది తెలుగు యాప్ అని అన్నారు. తెలుగు ఫ్లాట్‌ఫామ్ కాబ‌ట్టి జ‌నాల‌కు అర్థ‌మ‌య్యే తెలుగులో మాట్లాడాల‌ని లక్ష్మీ మంచుపై సైలెంట్‌గా సెటైర్ వేసేశారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నాకు అర్థ‌మ‌య్యే తెలుగులోనే మాట్లాడ‌టానికి పిలిచార‌ని ల‌క్ష్మీ మంచు రియాక్ట్ అయ్యింది. ఇంకా ఆమె మాట్లాడుతూ నేను ఇప్ప‌టి వ‌ర‌కు హోస్ట్ చేశాను. షో చేశాను. గెస్ట్‌గా రావ‌డం కూడా అయ్యింది అని చెబుతుండ‌గా అల్లు అర్జున్ మ‌ళ్లీ ప్రెసిడెంట్‌గారి అక్క అవ‌డం కూడా అయిపోయింది అంటూ మ‌ళ్లీ పంచ్ విసిరాడు. దానికి అమ్మో అమ్మో అమ్మ‌మ్మో అంటూ మ‌ళ్లీ ల‌క్ష్మీ త‌ల ప‌ట్టుకుని రియాక్ష‌న్ ఇస్తూ ఈ ప్రెసిడెంట్ అక్కకి చాలా క‌ష్టాలొచ్చాయి అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో విష్ణు మంచు అధ్య‌క్షుడిగా గెల‌వ‌డంపై బ‌న్నీ ఈ స్టైల్లో రియాక్ట్ అయ్యార‌ని క్లియ‌ర్ క‌ట్‌గా తెలుస్తుంది. ఏదైతేనేం ఇప్పుడు అల్లు అర్జున్‌, ల‌క్ష్మీ మంచు మ‌ధ్య స‌ర‌దాగా సాగిన ఈ సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ దీపావళికి ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని సమాచారం. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.


By November 03, 2021 at 07:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-punches-on-lakshmi-manchu-telugu/articleshow/87498137.cms

No comments