Breaking News

Karnataka సీఎంను ముద్దులతో ముంచెత్తిన మహిళ.. షాకైన నేతలు


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ భిన్నంగా చాటుకుంది. కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని ప్యాలెస్ గుట్టహళ్లి‌లో ముఖ్యమంత్రి బొమ్మై ఓ ఇంటి వద్దకు వెళ్లగా.. ఓ మహిళ ఆయనకు ముద్దులు పెట్టింది. సీఎం కుడిచేచేయిపై ఆమె ఆపకుండా ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సీఎం చేతిని తన ముఖంపై ఉంచి ఆయన దీవెనలు తీసుకుంది. ఆమె చర్యలపై పక్కనే ఉన్న మంత్రి అశత్థనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ ఆమెను వారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తన మూడు నెలల పాలనలో చారిత్రాత్మక పథకంగా ప్రకటించుకునే ‘జనసేవక’ పథకం కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ‘సకల’ పేరిట రూపొందించిన సేవా పథకాన్ని సమూలంగా మార్చి జనసేవకను తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసే అవసరం ఇకపై లేకుండా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించటం ఈ పథక లక్ష్యం. కాగా, ఈ సేవల పనితీరుపై అభిప్రాయాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘జన స్పందన’ వ్యవస్థ, రవాణా శాఖకు చెందిన సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించే మరో వ్యవస్థను ముఖ్యమంత్రి బొమ్మై సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 198 వార్డుల్లో సోమవారం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా మల్లేశ్వరం నియోజవర్గంలో పలువురు లబ్ధిదారుల నివాసాలకు సీఎం నేరుగా వెళ్లి చర్చలు జరపడం హాడావుడి సృష్టించింది. ప్యాలెస్‌ గుట్టహళ్లి, వయ్యాలికావల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న వారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు, వివిధ రకాల పింఛన్లు, ఆరోగ్య కార్డు, ఆధార్‌ తదితర కార్డులను ఐటీ బీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణతో కలిసి పంచారు. ఈ సమయంలోనే ఓ మహిళ సీఎంను ముద్దులతో ముంచెత్తింది.


By November 02, 2021 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-kisses-karnataka-cm-basavaraj-bommai-in-malleswaram-of-bengaluru/articleshow/87478509.cms

No comments