Breaking News

JustDial స్పాలలో వ్యభిచారానికి సహకారం.. అమ్మాయిల ఫోటోలతో కూడిన రేట్లు!


మసాజ్ పార్లర్లలో సెక్స్ రాకెట్‌ను ప్రోత్సహించినట్టు జస్ట్‌ డయల్‌పై ఆరోపణలు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు జస్ట్‌ డయల్‌కు సమన్లు జారీ చేసింది. వ్యభిచార కార్యకలాపాల వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు సైతం మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం. ఢిల్లీలోని స్పాలు వ్యభిచార కేంద్రాలుగా మారినట్టు ఇటీవల మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఇందులో జస్ట్ డయల్‌‌ను ప్రస్తావించారని సోమవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జస్ట్ డయల్‌పై విచారణకు ఒక దర్యాప్తు బృందాన్ని మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది. దక్షిణ ఢిల్లీలో ఉన్న స్పాల వివరాలను అందజేయాలని ఈ బృందం కోరింది. 24 గంటల్లో కొన్ని ‘’ల వ్యవహారాలపై మహిళా కమిషన్‌కు 15 కాల్స్, 32 వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. ఈ స్పాలలో 150 కంటే ఎక్కువ మంది యువతుల ఫోటోలు, వారి సేవలకు రేట్లు ఇచ్చారు. ‘‘ఒక ఫోన్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌లో స్పా ద్వారా ఒక యువతి ఫోటోను పంపారు.. దాని తర్వాత అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి.. ఇంకో ఫోన్ నంబర్ నుంచి వచ్చిన మరో మెసేజ్‌లో 14 మంది అమ్మాయిలు ఫొటోలు ఇచ్చారు. కమిషన్ బృందం స్పా సేవల వివరాలను అందజేయాలని కోరగా.. అమ్మాయి కోసం అనుకుని మసాజ్ సెంటర్ మాటున సాగిస్తున్న అక్రమ వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను వెంటనే ఇచ్చారు.. దీంతో స్పాల మాటున వ్యభిచారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను కమిషన్ కోరింది’ అని డీసీడబ్ల్యూ ఓ ప్రకటనలో తెలిపింది. ‘జస్ట్‌ డయల్’ అధికార యంత్రాగాన్ని పిలిపించి వారి వెబ్‌సైట్‌ జాబితాలోని ‘స్పా’లలో తనిఖీల కోసం విధానాన్ని వివరించాలని ఆదేశించింది. వ్యభిచారం నిర్వహణకు కమిషన్ బృందానికి మెసేజ్‌లు పంపిన స్పాల వివరాలను, అలాగే వారి సైట్‌లో జాబితా చేసేందుకు జస్ట్‌ డయల్ తీసుకున్న నగదు మొత్తం వివరాలు అందించాలని కూడా కమిషన్ కోరింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నవంబరు 12లోగా పూర్తిస్థాయి చర్యల నివేదిక అందజేయాలని క్రైమ్ బ్రాంచ్‌ను కమిషన్ ఆదేశించింది.‘‘రాజధానిలో వ్యభిచార రాకెట్‌లు నిర్వహిస్తుండటం ఆశ్చర్యకరం.. ఈ విషయంలో వారి పాత్రపై కూపీలాగడానికి మేం జస్ట్‌ డయల్‌ను పిలిపించాం.. వెంటనే జస్ట్ డయల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు కూడా జారీ చేశాం.. లైంగిక దోపిడీని ఆపడానికి కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ వివరించారు. అయితే, ఈ ఆరోపణలపై జస్ట్‌ డయల్ ఇంకా స్పందించలేదు. ఈ అంశంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నోటీసులు అందిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆరోపణలపై విచారణ చేపడతామని తెలిపారు.


By November 09, 2021 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-woman-commission-sends-notice-to-justdial-for-helping-sex-rackets-in-spa/articleshow/87599128.cms

No comments