Breaking News

Bus Fire పర్యాటకుల బస్సులో మంటలు.. కనీసం 46 మంది సజీవదహనం


జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి కనీసం 46 మంది సజీవదహనమైన దుర్ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది. పశ్చిమ్ బల్గేరియాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగుర్ని బల్గేరియా రాజధాని సోఫియాలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చేలరేగినట్టు అనుమానిస్తున్నారు. మృతుల్లో చాలా మంది ఉత్తర మాసిడోనియాకు చెందిన పర్యాటకులేనని బల్గేరియాలోని ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. సోఫియా నుంచి మాసిడోనియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయానికి బస్సులో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్టు గుర్తించారు. బల్గేరియా అంతర్గత భద్రత వ్యహారాల శాఖ ఫైర్ సేఫ్టీ విభాగం చీఫ్ నికోలయ్ నికొలోవ్ మాట్లాడుతూ.. ఉత్తర మాసిడోనియాకు వెళ్తుండగా బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2.00 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం మృతుల్లో 12 మంది చిన్నారులు సహా పలువురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ‘ఈ దుర్ఘటనలో కనీసం 46 మంది చనిపోయారు.. తొలుత బస్సులో మంటలు చెలరేగి, ఢీకొట్టడం లేదా ఢీకొట్టిన తర్వాత మంటలు చేలరేగడం జరిగింది’ అన్నారు. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తులో వెల్లడవుతుందని నికోలవ్ వివరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. విచారణ చేపట్టారని తెలిపారు. బస్సులో మంటలు చెలరేగడంతో ఏడుగురు అందులో నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. గాయపడినవీరికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కోచ్ పార్టీ టర్కీలోని ఇస్తాంబుల్‌ వారాంతపు హాలిడే ట్రిప్ నుంచి స్కోప్జేకి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని ఉత్తర మాసిడోనియా విదేశాంగ మంత్రి బుజర్ ఒస్మానీ పేర్కొన్నారు.


By November 23, 2021 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-46-people-killed-in-bus-crashed-in-flames-in-bulgaria/articleshow/87862906.cms

No comments