హీరో సూర్యకు బెదిరింపులు.. ఇంటి వద్ద పోలీసుల మోహరింపు! చర్చల్లో ఇష్యూ..
హీరో సూర్య నటించిన 'జై భీమ్' సినిమా అక్టోబర్ 2న విడుదలై పలువురి ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా మన ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూసి ఫిదా అయ్యాడు. ఇదిలాఉంటే మరోవైపు ఈ సినిమాపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వన్నియార్ సంఘం ప్రతిష్ఠను గిగజార్చుతున్నారని ఆరోపిస్తూ నిర్మాతలు సూర్య జోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోల వన్నియార్ సంఘం నోటీసులు పంపారు. దీంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో హీరో రావడం సంచలనంగా మారింది. దీంతో సూర్యకు పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అతని నివాసం వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. ప్రస్తుతం టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను మోహరించారు. ఈ బెదిరింపుల మధ్య సూర్యకు మద్దతుగా ఇంటర్నెట్‌లో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. #WeStandWithSuriya అనే ట్యాగ్‌తో సూర్యకు సపోర్ట్ అందిస్తున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే జై భీమ్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లు అర్థమవుతోంది. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకే) నాగపట్నం జిల్లా కార్యదర్శి సీతమల్లి పజాని సామి ప్రకటించడం సంచలనం అయింది. జై భీమ్ సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
By November 17, 2021 at 10:59AM
No comments