మైసూర్‌లో యంగ్ హీరోయిన్‌తో నాగ చైతన్య.. లవ్ స్టోరీ సక్సెస్‌తో అక్కినేని వారబ్బాయి జోష్!
యంగ్ అండ్ టాలెంటెడ్ అక్కినేని ప్రస్తుతం 'లవ్ స్టోరీ' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సాయి పల్లవి జతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడమే గాక నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ జోష్ లోనే నాగ చైతన్య తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన లేటెస్ట్ మూవీ ''కి సంబంధించి ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. సెలక్టెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ పట్టేస్తున్న నాగ చైతన్య.. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే మూవీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్లు రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ కంప్లీట్ కావడంతో తదుపరి షెడ్యూల్స్ విషయమై టోటల్ ప్లాన్ రెడీ చేసి పెట్టారట డైరెక్టర్ విక్రమ్ కుమార్. థాంక్యూ తదుపరి షెడ్యూల్‌కు కోసం మొదట రాజమండ్రి వెళ్లి అక్కడ ఓ మూడు నాలుగు రోజుల షూటింగ్ చేసి ఆ తర్వాత మైసూర్ వెళ్లబోతోందట టీమ్. అక్కడే చిత్రంలోని పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. నాగ చైతన్య- రాశీ ఖన్నా కాంబోలో షూట్ చేయనున్న కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా అక్కడే ఫినిష్ చేయాలని స్కెచ్చేశారట. ఈ షెడ్యూల్‌తో ప్యాచ్ వర్క్ సహా సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
By November 03, 2021 at 10:43AM
No comments