శివశంకర్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి విషమం.. అపస్మారక స్థితిలో కుమారుడు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/87900437/photo-87900437.jpg)
సినీ ఇండస్ట్రీని పీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. నేటికీ కరోనా ప్రభావంతో పలువురు సినీ నటులు అనారోగ్యం పాలవడం చూస్తున్నాం. రీసెంట్‌గా విశ్వ నటుడు కమల్ హాసన్‌కి కరోనా సోకిందనే వార్త ఇండస్ట్రీలో ఆందోళనలు రేకెత్తించగా ఇప్పుడు ప్రముఖ డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్ అని తెలియడం పలువురికి షాకిచ్చింది. కోవిడ్ బారినపడ్డ గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మరోవైపు శివశంకర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోమ్ క్వారంటైన్‌లో ఉండగా, పెద్ద కుమారుడు కరోనా బారినపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. కొరియోగ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్ పదికిపైగా భాషల్లో సేవలందించారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. తెలుగులో 'మగధీర' సినిమాలోని ‘ధీర.. ధీర’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నటుడిగానూ వెండితెరపై అలరించారు. 30కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై తన మార్క్ చూపించారు.
By November 25, 2021 at 07:00AM
No comments