Breaking News

Big Breaking భారత్ మాయన్మార్ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం


ఈశాన్య రాష్ట్రాలను వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున మాయన్మార్-భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదయినట్టు తెలిపింది. మిజోరాంలోని థెంజ్వాల్‌కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. దాదాపు ఉదయం 5.15 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం వివరించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటు, యూరోపియన్-మెడిటీరియన్ సిస్మాలజీ సెంటర్ (EMSC) సైతం భారత్‌లోని కోల్‌కతాకు సమీపాన బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో భూకంపం సంభవించినట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ఇది తీవ్ర భూకంపమని పేర్కొంది. చిట్టగాంగ్‌కు పశ్చిమాన 184 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు ఈఎంఎస్సీ వివరించింది. తొలుత భూకంప తీవ్రతను 5.8గా పేర్కొన్న ఈఎంఎస్సీ తర్వాత.. సవరించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదయ్యిందని, మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు ఈశాన్యంగా 126 కి.మీ. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. భూకంపం తీవ్రతకు ఏమేరకు ఆస్తి, ప్రాణనష్టం వాటిళ్లిందనేది తెలియాల్సి ఉంది. బంగాళాఖాతం సమీపంలోనే భూకంప కేంద్రం ఉండటం ఆందోళన వ్యక్తమవుతోంది.


By November 26, 2021 at 06:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/very-strong-earthquake-of-6-1-magnitude-strikes-india-myanmar-border-region/articleshow/87920774.cms

No comments