Breaking News

మిరాకిల్.. చనిపోయాడని మార్చురీలో భద్రం.. 7 గంటల తర్వాత ప్రాణాలతో!


రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. రాత్రివేళ కావడంతో ఉదయం పోస్ట్‌మార్టం చేస్తామని చెప్పి ఆస్పత్రి సిబ్బంది మార్చురీలోని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అయితే, అనూహ్యంగా ఏడు గంటల తర్వాత అతడు కదులుతున్నట్టు కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో వైద్యులకు ఈ విషయం తెలియజేసి, బయటకు తీశారు. అతడిలో చలనం మొదలవ్వడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మెరుగుపడింది. అనూహ్యమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరాదాబాద్ మున్సిపాల్టీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీకేశ్ కుమార్ (40) గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడిని వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించడగా.. అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించిన చనిపోయినట్టు ధ్రువీకరించాడు. మర్నాడు పోస్ట్‌మార్టం చేస్తామని చెప్పి కవరులో చుట్టు మార్చురీ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. శవ పంచనామాకు సంబంధించిన డాక్యుమెంట్లపై కుటుంబసభ్యులు సంతకాలు చేశారు. ఏడు గంటల గడిచిపోయిన తర్వాత అతడిలో కదలికలు రావడం శ్రీకేశ్ వదిన గమనించారు. వెంటనే మిగతా కుటుంబసభ్యులు కుటుంబ సభ్యులు అతడిచుట్టూ గుమిగూడారు. వైద్యులు, పోలీసులను పిలవడంతో ఫ్రీజర్ నుంచి అతడిని బయటకు తీశారు. కదలికలు రావడంతో తక్షణమే మెరుగైన వైద్యం కోసం మీరట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా స్పృహలోకి రాలేదు కానీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు హామీ ఇచ్చారని కుటుంసభ్యులు తెలిపారు.


By November 21, 2021 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dead-man-out-alive-from-mortuary-freezer-after-7-hrs-moradabad-of-up/articleshow/87829474.cms

No comments