Breaking News

కొవాగ్జిన్‌‌కు అనుమతిపై మరోసారి WHO కొర్రీలు.. నవంబరు 3 వరకూ తప్పని నిరీక్షణ!


అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ () అనుమతి మరింత జాప్యం కానుంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్)‌‌ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 19న భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్‌ఓకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలల నుంచి ఏదో ఒక కారణంతో అనుమతిలో జాప్యం జరుగుతోంది. గతంలో పలు కొర్రీలు వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తాజాగా మంగళవారం జరిగిన సమావేశంలో టీకాకు సంబంధించి భారత్ బయోటెక్‌ను మరింత స్పష్టత కోరింది. సాంకేతిక సలహా బృందం (TAG) ఈ మేరకు అదనపు వివరాలను కోరింది. భారత్ బయోటెక్ అందజేసే వివరాల ఆధారంగా నవంబరు 3న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో కొవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌లో చేర్చడం సమీక్షించినట్టు డబ్ల్యూహెచ్‌ఓ పీటీఐ అడిగి ఓ ప్రశ్నకు ఈ మెయిల్ ద్వారా స్పష్టతనిచ్చింది. ‘అక్టోబరు 26న సాంకేతిక సలహా బృందం సమావేశమయ్యింది.. కొవాగ్జిన్‌కు సంబంధించి టీకా తయారీదారుల నుంచి అదనపు స్పష్టత కోరింది.. దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల ప్రయోజనాలకు సంబంధించి ఈయూఎల్‌పై తుది నిర్ణయం తీసుకోంది.. ఉత్పత్తిదారు నుంచి ఈ వారంతంలో సమాధానం వస్తుందని ట్యాగ్ భావిస్తోంది.. వీటి ఆధారంగా నవంబరు 3న బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకుముందు, డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతిని డాక్టర్ మార్గరెట్ హ్యారిస్ మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం జాబితాలో చేర్చే విషయమై భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను సాంకేతిక సలహా బృందం సమీక్షించిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ అన్నీ సక్రమంగా ఉండి, సవ్యంగా జరిగి కమిటీ సంతృప్తి చెందితే, వచ్చే గంటల్లోపు సిఫార్సును ఆశిస్తున్నాం’ అని న్నారు. భారత్ స‌హా కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కొన‌సాగుతున్నా… డ‌బ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన క‌రోనా వ్యాక్సిన్ల జాబితాలో మాత్రం లేదు. డబ్ల్యూహెచ్ఓ EUA లేకుండా కొవాగ్జిన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆమోదం లభించిన టీకాగా పరిగణించవు. టీకా ఆమోదం కోసం భారత్ బయోటెక్ అవసరమైన డేటాను సమర్పించినట్టు తెలిపినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ తాజాగా మరిన్ని అంశాలపై వివరణ కోరింది.


By October 27, 2021 at 06:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-seeks-additional-clarifications-for-covaxin-vaccine-emegency-use-listing/articleshow/87294136.cms

No comments