Breaking News

UP Violence లఖింపూర్ ఖేర్ ఘటన.. రైతులపైకి కారు దూసుకెళ్లిన దృశ్యాలు.. వీడియో వైరల్


ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేర్ వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, రైతులపైకి కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, 25 సెకెన్ల ఈ వీడియోలో వాహనం ఎవరు నడుపుతున్నదీ స్పష్టంగా కనిపించడం లేదు. అయితే, తొలుత ఓ ఎస్‌యూవీ వాహనం ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి వెళ్లడం కనబడుతోంది. వీడియో ప్రకారం..వాహనం ఢీకొట్టిన తర్వాత రైతులు కిందపడిపోవడం.. పలువురు భయంతో పరుగులు తీయడం.. తర్వాత దాని వెనుక సైరన్ మోగిస్తూ మరో వాహనం రైతులపైకి దూసుకొచ్చింది. ఆదివారం ఆందోళన సందర్భంగా రైతులకు తెలియకుండానే వారిని వెనుక నుంచి వచ్చి వాహనం ఢీకొట్టిందని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పారు. వెనుక నుంచి వచ్చిన రైతులను ఢీకొట్టిన కారు.. ఘటనా స్థలంలో కనిపిస్తున్న వాహనం ఒకేలా ఉన్నాయి. వాహనం వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. కారులోని వారిపై దాడి చేశారు. కారులో నుంచి లాగి కర్రలతో చితక్కొట్టారు. దీంతో కారు డ్రైవర్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. రైతులను తొలుత నిర్దాక్షిణ్యంగా వాహనంతో గుద్దించి, వారి ప్రాణాలు తీయడంతోనే దాడి చేశారు. రెండు కార్లకు నిప్పంటించి దగ్దం చేశారు. ఈ ఘటనను ప్రతిపక్షాలు సహా మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.45 లక్షలు, గాయపడినవారికి రూ.10 లక్షలు పరిహారం యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. లఖింపుర్ ఖేరి జిల్లా బన్బీర్‌పుర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కారు, మరో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని రెండు కార్లను తగలబెట్టి, రైతులు దాడికి పాల్పడటంతో ఓ కారులోని నలుగురు నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.


By October 05, 2021 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/viral-video-appears-to-show-farmers-being-run-over-by-suv-in-lakhimpur-kheri-of-up/articleshow/86772999.cms

No comments