Breaking News

SVC 50: రామ్ చరణ్-శంకర్ సినిమాపై వైరల్‌ అవుతున్న మరో అప్‌డేట్.. ఫ్యాన్స్‌ డబుల్ ధమాకానే!


ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా ప్రాజెక్టుల మాటే వినిపిస్తోంది. అంతకు ముందు పలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా.. ‘బాహుబలి’ సినిమా మాత్రం సినిమాల రేంజ్‌ను మార్చేసింది. స్టార్ హీరోలంతా వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో చాలా వరకూ పాన్ ఇండియా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. అందులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. ఇందులో మెగా పవర్‌స్టార్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో కలిసి మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. నిర్మాణంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఈ బ్యానర్‌లో నిర్మిస్తున్న 50వ సినిమా ఇది కావడం మరో విశేషం. ‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో సినిమాకి పని చేస్తున్న ప్రతి ఒక్కరు, కళ్లజోడు పెట్టుకొని, స్టైలిష్‌గా నడుచుకూ వెళ్లడం మనం చూడొచ్చు. అయితే ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి ఏదో ఒక వార్త పుట్టుకొస్తుంది. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్‌ రోల్ నటిస్తున్నారని మరో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


By October 08, 2021 at 10:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charn-to-be-seen-in-dual-role-in-shankar-movie/articleshow/86859301.cms

No comments