Breaking News

Superstar Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు


సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్ర‌క‌టిచింది. సినిమా రంగంలో విశేష‌మైన సేవ‌ల‌ను అందించే వ్య‌క్తుల‌ను ప్ర‌క‌టించే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారం ఆయ‌న్ని ఇప్పుడు వ‌రించింది. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న సినీ రంగానికి సేవ‌లు చేస్తున్నారు. 2019 ఏడాదికిగానూ ఆయ‌న ఈ అవార్డును అందుకోనున్నారు. న‌టుడిగా, స్టార్ హీరోగా, సూప‌ర్‌స్టార్‌గా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇలా ఆయ‌న త‌న‌దైన విశిష్ట‌త‌ను చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే త‌న గురువు బాల‌చంద‌ర్ ఈ సమయంలో లేక‌పోవ‌డం బాధ‌గా ఉంద‌ని ఆయ‌న్ని గుర్తుకు చేసుకున్నారు. 2010లో కె.బాల‌చందర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం విశేషం. ఇప్పటి వరకు రజినీకాంత్ 168 సినిమాల్లో నటించారు. ఆయన 168వ చిత్రమే ‘అన్నాత్త’. ఈ సినిమా రూపంలో తమ తలైవర్ రజినీకాంత్ బహుమతి ఇస్తున్నాడని ఎదరుచూడసాగారు. అన్నాత్త ఈ చిత్రం నవంబర్ 4న విడుదలవుతుంది. దీపావళి సందర్భంగా రజినీకాంత్ ఆయన అభిమానులకు ఇంకా పెద్ద గిఫ్ట్‌నే అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అవార్డును తలైవర్ అందుకోబోతున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినీ రంగంలో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అనేది నెంబ‌ర్ వ‌న్‌. మొద‌టి ఫీచ‌ర్ ఫిల్మ్ రాజా హ‌రిచంద్రను డైరెక్ట్ చేసిన ఫాల్కేగుర్తుగా ఈ అవార్డును సినీ రంగంలో బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌ను క‌న‌ప‌రిచిన‌వారికి ఇస్తున్నారు. 1969 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. దేవికా రాణి, బ్రినేంద్ర‌నాథ్ సిర్‌కార్‌, పృథ్వీరాజ్ క‌పూర్‌, పంక‌జ్ ములిక్‌, రుబి మియెర్స్‌, బి.ఎన్‌.రెడ్డి, ధీరేంద్ర‌నాథ్ గంగూలీ, క‌న్న‌న్ దేవి, నితిన్ బోస్‌, రాయ్‌చంద్ బోర‌ల్‌, సోర‌బ్ మోడి, పైడి జ‌య‌రాజ్‌, నౌష‌ద్‌, ఎల్‌.వి.ప్రసాద్‌, దుర్గా కోటె, స‌త్య‌జిత్ రాయ్‌, శాంతారాం, నాగిరెడ్డి, రాజ్ క‌పూర్‌, అశోక్ కుమార్‌, ల‌తా మంగేష్క‌ర్‌, అక్కినేని నాగేశ్వ‌ర్రావు, బ‌ల్జీ పెండార్క‌ర్‌, భూపేన్ హ‌జారికా, మ‌జురుహ్ సుల్తాన్‌పురి, దిలీప్ కుమార్‌, రాజ్ కుమార్‌, శివాజీ గ‌ణేశ‌న్‌, క‌వి ప్ర‌దీప్‌, బి.ఆర్‌.చోప్రా, హృషికేష్ ముఖ‌ర్జీ, అశా బోస్లే, య‌ష్ చోప్రా, దేవ్ ఆనంద్‌, మృణాళిని సేన్‌, అదుర్ గోపాల‌కృష్ణ‌న్‌, శ్యామ్ బెన‌గ‌ల్‌, తాప‌న్ సిన్హా, మ‌న్నాదె, వి.కె.మూర్తి, డి.రామానాయుడు, కె.బాల‌చంద‌ర‌ర్‌, సౌమిత్రా చ‌ట‌ర్జీ, ప్రాణ్, గుల్జ‌ర్‌, శ‌శి క‌పూర్‌, మ‌నోజ్ కుమార్, కె.విశ్వ‌నాథ్‌, వినోద్ ఖ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జినీకాంత్ ఈ ప్రెస్టిజియ‌స్ అవార్డును అందుకున్నారు.


By October 24, 2021 at 10:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/superstar-rajinikanth-got-dadasaheb-phalke-award/articleshow/87234654.cms

No comments