RGV: ఇది క్షమించరాని పాపం! కసాయి వాడు కూడా కనికరం చూపించడు.. అడ్డంగా బుక్కైన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు.. ఆయన ఏది చేసిన అందులో ఎంతో కొంత స్పెషాలిటీ ఉండటమే గాక కాస్త వివాదమూ కనిపిస్తుంటుంది. ఈ సృష్టిలోని ఏ ఒక్క విషయాన్నీ వదలకుండా అన్నింటిపై బాహాటంగా మాట్లాడుతూ సంచలనం సృష్టించే .. దేవతలంటే తనకు నమ్మకం లేదని, అదంతా ఓ భ్రమ అని ఎప్పుడూ చెబుతుంటారు. అలాంటి ఈ వివాదాస్పద వీరుడు ఏకంగా అమ్మవారికి మందు తాగించి జనాల్లో చర్చలకు తెరలేపాడు. తాను రూపొందించబోతున్న '' మూవీ ప్రారంభోత్సవం కాస్త వెరైటీగా ప్లాన్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఊరేగింపుగా వరంగల్ చేరుకున్నారు. ఈ ప్రయాణంలో మధ్యలోనే వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలోని అమ్మవారికి మందు తాగించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ''నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా.. చీర్స్'' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వర్మ తీరును తప్పుబడుతూ కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు. ''విగ్రహం తాగదు కాబట్టి పోస్తున్నారు ఒకవేళ తాగేవాళ్లు ఉంటే పోస్తారా మీరు చెప్పండి'' అని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. ''వాస్తవమే కదా వర్మ గారు.. ఊర్లలో ఎల్లమ్మ, మైసమ్మ పండగలు చేసినపుడు ముందుగా దేవుడికి పోస్తారు'' అని కొందరు, '' గారు మీరు ఎంతో మేధావి, మాటకారి అని తెలుసు, కానీ ఏ దేవుడు నీ కూడా హేళన చేయకూడదు. ఇది క్షమించరాని పాపం. ఈ పాపానికి శిక్ష అనుభవించే టైమ్‌లో మాత్రం కసాయి వాడు కూడా మీ మీద కనికరం చూపించడు'' అంటూ ఇంకొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. మొత్తానికి మందు, దేవతకు ముడిపెట్టి ఇలా షూటింగ్‌కి ముందే 'కొండా' సినిమాకు భలే ప్రమోషన్ తెచ్చుకున్నారు వర్మ అనేది ఇంకొందరి వాదన.
By October 13, 2021 at 06:57AM
No comments