Breaking News

Ravi Teja: నెక్ట్స్ మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చి మాస్ మహరాజా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే..


ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు ‘మాస్ మహరాజ’ . కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మారిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఎలాంటి జానర్‌ సినిమా అయినా.. ఆయన తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచుతూ వచ్చారు. ఇక దశలో ఆయన చేసిన ప్రతీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు పడటంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు రవితేజ. మళ్లీ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే ఆయన మాత్రం నిరాశ చెందకుండా.. సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్న రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన శరత్ మండవా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ‘రామారావు అన్‌డ్యూటీ’ అనే టైటిల్‌తో కొన్ని వాస్తవకథల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోనే ఇద్దరు హీరోయిన్లు రవితేజాతో నటిస్తున్నారు. ఇక తాజాగా రవితేజా 69వ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. త్రినాథరావు నిక్కిన దర్శకత్వంలో ‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్‌లో రవితేజా చీకట్లో రవితేజా ఆకారాన్ని మాత్రమే చూపించారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాకర్టీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.


By October 02, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/official-shooting-for-ravi-teja-69th-movie-starts-from-october-4th/articleshow/86702019.cms

No comments