Rajinikanth: బాలయ్య టైటిల్‌తో రజినీకాంత్.. ఈసారైనా హిట్ కొట్టేనా?
సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆయన సినిమా ‘అన్నాత్త’ కోసం ఎదురుచూస్తున్నారు. సందర్భంగా నవంబర్ 4న సినిమా విడుదలకు సన్నద్ధమైంది. దసరా సందర్భంగా విడుదలైన టీజర్ పక్కా కమర్షియల్ కోణంలో రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా కనిపిస్తుంది. మరి తెలుగులో ఈ సినిమాను ఏ టైటిల్‌తో విడుదల చేస్తారోనని సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ‘పెద్దన్న’ పేరుతో తెలుగులో విడుదలకానుంది. దీనికి సంబంధించిన తెలుగు పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో పెద్దన్నయ్య టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ సినిమా చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజినీకాంత్ పెద్దన్నగా మెప్పించనున్నారు. పెద్దనయ్య పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అయితే రజినీకాంత్ పెద్దన్న పక్కా కమర్షియల్ మూవీగా కనిపిస్తుంది. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో, అలాంటి ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి డైరెక్టర్ శివ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి తెలుగులో టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. రజినీకాంత్‌కు సరైన బాక్సాఫీస్ హిట్ తగిలి చాలా కాలమే అవుతుంది. పేట్ట, దర్బార్ చిత్రాలు ఇటు తెలుగు, అటు తమిళంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మరి శివ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి పెద్దన్న సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను సూపర్‌స్టార్ మెప్పించి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా అని చూడాలి.
By October 15, 2021 at 08:32AM
No comments