Prakash Raj: చైతన్య, సామ్ విడాకులపై స్పందించిన ప్రకాశ్ రాజ్..!
నెలన్నర రోజులుగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని అభిమానులు బాధపడ్డారు. అక్కినేని నాగార్జున, అమల సహా సినీ సెలబ్రిటీలందరూ అది వారిద్దరూ వ్యక్తిగత విషయమని వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని చెబుతున్నారు. చై, సామ్ విడిపోవడంపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘విడాకులు తీసుకోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించి, పెళ్లి చేసుకుని విడిపోయే సందర్భంలో ఎంతో బాధ ఉంటుంది. ఆ నొప్పి ఉన్నా నాగచైతన్య, సమంత అలా విడిపోవడం అనే విషయం వారి వ్యక్తిగతం. వారి నిర్ణయాన్ని మనం గౌరవించాలి. వారికి ఇబ్బంది కలిగించకూడదు’’ అని అన్నారు. పదేళ్లుగా ఒకరికొకరు తెలిసిన చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు రిలేషన్ షిప్‌లోనూ ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల ముందు పెద్దల సమక్షంలో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి వారిద్దరూ విడిపోతారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగినట్లు వారిద్దరూ మీడియా అడిగిన ప్రశ్నలకు నేరుగా బదులివ్వలేదు. సరైన కారణాలు చెప్పలేదు కానీ.. విడిపోతున్నామని ప్రకటించి వార్తల్లో నిలిచారు.
By October 03, 2021 at 11:09PM
No comments