Breaking News

Pawan Kalyan: ఓటేసిన పవన్ కళ్యాణ్, చిరంజీవి.. అన్నం పెట్టే చోటే ఇలాంటి పనులా? పవర్ స్టార్ కామెంట్స్


గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎలక్షన్స్ మరింత హీటెక్కించాయి. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నడుమ హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న రచ్చకు నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది. నేడు (ఆదివారం) జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 'మా' పోలింగ్ మొదలైంది. మొత్తం 883 మంది సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, , మంచి లక్ష్మి, రామ్ చరణ్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా.. తన ఓటును నమోదు చేసి మీడియాతో మాట్లాడారు. తిప్పికొడితే 900 మంది.. 'మా' ఎలక్షన్స్‌ కోసం వ్యక్తిగత దూషణలు అవసరమా? అని పేర్కొన్న పవన్.. గతంలో తానెప్పుడూ ఇంత పోటీ చూడలేదని, ఇంత హడావిడి అవసరమా అని అన్నారు. మనుషులను విడగొట్టడం చాలా తేలిక.. కలిపి ఉంచడమే చాలా కష్టం.. సినిమా వాళ్లంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పారు. ఏ ప్లాట్‌ఫామ్ అయితే అన్నం పెడుతుందో దాన్ని కించపర్చుకోవడం అవసరం లేదని అన్నారు. 'మా' ఎన్నికల్లో డబ్బులు పంచడం అనే అంశంపై 'నో కామెంట్' అన్నారు. ఇకపోతే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న రామ్ చరణ్.. మంచు విష్ణు, మోహన్ బాబులను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మా పోలింగ్ కేంద్రం వద్ద సినీ తారల హడావిడి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో 500 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదేరోజు రాత్రి 8 గంట‌లలోపు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.


By October 10, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-2021-pawan-kalyan-submitted-his-vote/articleshow/86906741.cms

No comments