Breaking News

NTR: ప్రభాస్ స్టయిల్లో ఎన్టీఆర్ ప్లానింగ్.. బాలీవుడ్ డైరెక్టర్‌తో పాన్ ఇండియా మూవీ


టాలీవుడ్ నేటిత‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. యంగ్ టైగ‌ర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరో వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న‌.. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై కొమురం భీమ్‌గా సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కుపాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. రామ్‌చ‌ర‌ణ్ ఇప్ప‌టికే హిందీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. అయితే ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్‌’ తో వారిని తొలిసారి మెప్పించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెడితే, ఆ త‌ర్వాత వ‌చ్చే ఇమేజ్‌ను బేస్ చేసుకునే సినిమాలు చేయాల‌నేది ఎన్టీఆర్ ప్లాన్. అందుకు త‌గిన‌ట్లే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసేసుకున్నాడు తార‌క్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న తాజా స‌మాచారం మేర‌కు తార‌క్ మ‌రో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసేస్తున్నార‌ట‌. అదెవ‌రితోనో కాదు.. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీతో. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థం చివ‌ర‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఎన్టీఆర్ పోక‌డ చూస్తుంటే ఆయ‌న టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌ను ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ తెలుగు ద‌ర్శ‌కులైన సుజిత్‌, రాధాకృష్ణ కుమార్‌ల‌తో సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఇప్పుడు అదే పంథాలో తార‌క్ కూడా కొర‌టాల శివ‌తో సినిమా చేస్తూనే సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమాను లైన్లో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌రోవైపు ఈ గ్యాప్‌లో బుల్లితెర‌పై ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రోగ్రామ్ తొలి సీజ‌న్‌ను పూర్తి చేసేశారు. త‌న‌దైన స్టైల్లో సామాన్యుల‌ను,సెల‌బ్రిటీల‌ను మిక్స్ చేసి షోకు వ‌న్నె తెచ్చారు తార‌క్‌. ఇక సినిమాల‌తో బిజీగా మారిపోతున్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్‌’లో తెలంగాణ గోండు బెబ్బులి కొమురం భీమ్‌గా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. భారీ అంచ‌నాల‌తో రాబోతున్న ఈ సినిమాలో మ‌రో హీరో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రీ ఇండిపెండెన్స్ ముందే జ‌రిగే ఓ ఫిక్ష‌న్ పీరియాడిక‌ల్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్‌’ తెర‌కెక్కుతోంది. ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ తార‌లు కూడా న‌టిస్తుండ‌టంతో సినిమాపై హైప్స్ పీక్స్‌లోఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఆస‌క్తిని చూపిస్తున్నాయి.


By October 25, 2021 at 08:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-tiger-ntr-pan-india-movie-with-bollywood-director-sanjayleela-bhansali/articleshow/87247961.cms

No comments