Breaking News

Meta పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై ఆ పేరుతోనే సేవలు


సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ మాతృసంస్థ సంస్థను ఇకపై ‘’గా పిలవనున్నారు. ఈ మేరకు సంస్థ పేరును మార్చినట్టు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్‌)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఆ సంస్థకు చెందిన సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. మాతృసంస్థ పేరును మాత్రమే మార్చామని జుకర్‌బర్గ్ వివరించారు. ప్రజలు వర్చువల్‌ విధానంలో కలుసుకొని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేసే సరికొత్త వేదిక మెటావర్స్‌ని ఆయన చెబుతున్నారు. రాబోయే దశాబ్దంలో వంద కోట్ల మందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్‌, క్వెస్ట్‌ వీఆర్‌ హెడ్‌సెట్‌, హొరైజన్‌ వీఆర్‌ వంటివి భాగంగా ఉన్నాయని.. వాటన్నింటికీ ‘ఫేస్‌బుక్‌’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. ‘‘తమను ప్రస్తుతం కేవలం సోషల్ మీడియా సంస్థగానే పరిగణిస్తున్నారు.. కానీ వాస్తవానికి ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీ.. ‘మెటా’ అనేది గ్రీకు పదం.. మేము సామాజిక సమస్యలతో పోరాడటం.. మూసి ఉంచిన వేదికల కింద జీవించడం నుంచి చాలా నేర్చుకున్నాం.. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి అంశాన్ని తదుపరి అధ్యాయాన్ని రూపొందించడంలో సహాయపడే సమయం ఇది’’ అని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు నుంచి మా కంపెనీ ‘మెటా’ అని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను.. మా లక్ష్యం అలాగే ఉంది, ఇప్పటికీ ప్రజలను ఒకచోట చేర్చడం, మా యాప్‌లు, వాటి బ్రాండ్‌లు మారడం లేదు’ అని తెలిపారు. ‘మెటావర్స్’ని నిర్మించడానికి యూరోపియన్ యూనియన్‌లో 10,000 మందిని నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది.ఇదిలా ఉండగా, ఫేస్‌బుక్‌ పేపర్ల పేరిట ఇటీవల బయటపడ్డ పత్రాలతో సంస్థ తీవ్ర విమర్శల పాలైందని.. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంస్థ పేరు మార్చారని విశ్లేషకులు వ్యాఖ్యానించడం గమనార్హం. రియల్ ఫేస్‌బుక్ ఓవర్‌సైట్ బోర్డ్ అనే స్వచ్ఛంద సంస్థ.. ఆయిల్, పొగాకు వంటి ప్రధాన పరిశ్రమలు తమ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రీబ్రాండ్ చేసినట్లు ఈ సంస్థ కూడా అదే పంథాను ఎంచుకుందని విమర్శించింది. ‘రీబ్రాండ్ సబ్జెక్ట్‌ను మార్చడం వారికి సహాయపడుతుందని ఫేస్‌బుక్ భావిస్తోంది.. అసలు సమస్య పర్యవేక్షణ, నియంత్రణ అవసరం’ అని పేర్కొంది.


By October 29, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/facebook-chief-mark-zuckerberg-announced-changes-its-name-to-meta-in-rebranding-exercise/articleshow/87351289.cms

No comments