Megastar Chiranjeevi - KondaPolam Review: మెగాస్టార్ చిరంజీవి ‘కొండపొలం’ రివ్యూ..ఆసక్తికరమైన కామెంట్స్
యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘కొండపొలం’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే గురువారం ఈ సినిమాను వైష్ణవ్ తేజ్ మామయ్య, ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన ఆయన సినిమా గురించి మాట్లాడుతూ ... ‘‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామ..ఇలా క్రిష్‌గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్‌కు ఛాన్స్ ఉంటుంది’ అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు చిరంజీవి. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను ఆధారంగా చేసుకుని వైష్ణవ్, రకుల్ జోడీగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. అక్టోబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ సమయంలో షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పుడు పరిమిత సంఖ్యలోని కాస్ట్ అండ్ క్రూతో, ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ‘కొండపొలం’ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ క్రిష్.
By October 08, 2021 at 05:55AM
No comments