Breaking News

Maa Elections : సారీ చెప్పే వరకు వాడిని తిడుతూనే ఉంటా!.. నరేష్ మీద శివాజీ రాజా సంచలన కామెంట్స్


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు ఎంతలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. మా సంక్షేమం గురించి కాకుండా వ్యక్తిగత ఆరోపణలు, దూషణల స్థాయికి దిగజారిపోయింది. మా ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ కోసం ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్ ముందుకు దూసుకుపోతోన్నాడు. అయితే ఇలాంటి సమయంలో కూడా ఎంటరయ్యాడు. తనపై గతంలో చేసిన ఆరోపణలను గుర్తు చేశాడు. ‘ఎన్నికల వరకు అంతా ఇలా ఉంటుంది. మళ్లీ ఆ తరువాత అందరూ కలిసిపోతారు. అయితే గెలిచినవాడు నాలుగు రోజులు సంతోషపడితే.. ఓడినవాడు రెండు రోజులు బాధపడతాడు. ఆతరువాత మళ్లీ యథావిథిగానే ఉంటుంది. మా బిల్డింగ్ ఒకవేళ కడితే.. ఇటుక, సిమెంట్ పట్టుకెళ్లారంటూ నరేష్ ఆరోపణలు చేస్తాడు. గత ఎన్నికల్లో అలానే తనపై తప్పుడు ఆరోపణలు చేసి గెలిచాడు. అమెరికా టూర్‌లో ఏదో జరిగిందని, ఎంతో నొక్కేశామంటూ ఆరోపణలు చేసి గెలిచాడు. అలాంటిదేమీ జరగలేదని కమిటీ కూడా నిర్దారించింది. ఆతరువాత అయినా కూడా నరేష్ సారీ చెబుతాడేమోనని ఎదురుచూశాను. వాడు సారీ చెప్పేవరకు తిడుతనే ఉంటాను. ఎక్కడైనా కనిపిస్తే మామూలుగానే ఉంటాం.. కలిసి నటిస్తామ’ని శివాజీ రాజా ఓ మీడియా చానెల్‌తో మాట్లాడాడు. అక్టోబర్ 10న అంటే రేపు జరగున్నాయి. ఇక ఈ వివాదాలకు అందరూ ముగింపు పలుకుతారో.. లేదా కొత్త వివాదాలకు తెరలేపుతారో చూడాలి.


By October 09, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sivaji-raja-fires-on-vk-naresh-in-maa-elections/articleshow/86884412.cms

No comments