Breaking News

Maa Elections 2021 : ‘సలీమ్’ వివాదం తెరపైకి.. వైవీఎస్ చౌదరిని అలా.. మంచు ఫ్యామిలీ పరువుదీసిన నాగబాబు


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడో వ్యక్తిగతంగా మారాయి. ఒకరిపై ఒకరు దూషణలు, ఆరోపణలకు దిగారు. ప్రకాష్ రాజ్, ప్యానెల్ పోటీ పడుతోన్నా.. ప్రతీ ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. మీద లోకల్ నాన్ లోకల్ అనే కామెంట్లు, షూటింగ్‌లకు సరిగ్గా రాడు, నిర్మాతలతో వివాదాలున్నాయ్, ఇది వరకే బ్యాన్ చేసేశారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్‌కు అండగా మెగా ఫ్యామిలీ ఉంటుందని నాగబాబు కుండబద్దలు కొట్టేశాడు. అయితే నాగబాబు చివరగా తన ప్రచారాన్ని చేశాడు. గత రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వస్తూ ప్రకాష్ రాజ్ గురించి, అతని ప్యానెల్ గురించి చెబుతూనే ఉన్నాడు. మంచు విష్ణు ప్యానెల్ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఉన్నాడు. చివరగా ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయాలి? మంచు విష్ణుకు ఎందుకు ఓటు వేయాలి? ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయకూడదు? మంచు విష్ణుకు ఎందుకు ఓటు వేయకూడదు?అనేది మాట్లాడుకుందామని నాగబాబు అన్నాడు. ‘ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయాలి.. ఆయన కింది స్థాయి నుంచి వచ్చాడు.. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. నటుడి కష్టాలు ఎలా ఉంటాయో అతడికి తెలుసు. అలాంటి వాడు అధ్యక్షడు అయితేనే నటుల గురించి ఆలోచిస్తాడు. ఇక మంచు విష్ణుకు ఎందుకు ఓటు వేయాలంటే.. మోహన్ బాబు కొడుకు. అంతకంటే ఏమీ లేదు. మోహన్ బాబు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వారే. కానీ ఆయన పోటీ చేయడం లేదు. ఆయన కొడుకు పోటీ చేస్తున్నాడు. ఇక ఇంత కంటే ఆయనకు ఎందుకు ఓటు వేయాలో కారణం లేదు. ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయకూడదు.. తెలుగోడు కాదు, నిర్మాతలతో కాంట్రవర్సీలున్నాయి. ఇంతకంటే ఎవ్వరూ కూడా ఎక్కువ చెప్పడం లేదు. ఎవ్వరు చెప్పినా ఇవే తిప్పితిప్పి చెబుతారు. తెలుగోడు కాదు అని అంటున్నారు.. ఆయన డబ్బులు మాత్రం కావాలా? ఆయన డబ్బులు తీసుకుని మా మెంబర్ షిప్ ఎందుకు ఇచ్చారు? మా మెంబర్‌కు అన్ని రకాల హక్కులుంటాయి. ఇక కాంట్రవర్సీలు అంటారా? మీ ఫ్యామిలీలో ఎన్ని లేవు. సినిమా విషయంలో మీరు చేసింది అందరికీ తెలిసిందే. వైవీఎస్ చౌదరి రెమ్యూనరేష్ ఎగ్గొడితే.. కోర్టుకు వెళ్లిన సంగతి అందరికీ తెలియదా?.. ఓ స్టార్ డైరెక్టర్‌కు అలాంటి గతి పడితే.. మామూలు వాళ్లను మీరు ఇంకెలా చేసి ఉంటారు. అందుకే కాంట్రవర్సీల జోలికి వెళ్లకండి’ అని మంచు ఫ్యామిలీ మీద నాగబాబు కామెంట్ చేశాడు.


By October 09, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-babu-about-manchu-family-in-yvs-chowdary-at-saleem-movie/articleshow/86883606.cms

No comments