Donald Trump గురించి చైనాకు ఉప్పు.. వెన్నుపోటు పొడిచిన అమెరికా ఆర్మీ జనరల్!
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఆలోచనలను జనరల్‌కు అగ్రరాజ్యం సైనికాధికారి ముందే ఫోన్ చేసిచెప్పిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్ ఉడ్‌వర్డ్, రాబర్ట్ కోస్టాలు రాసిన ‘పెరల్’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు. ‘అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన మార్క్ మిల్లీ.. కోవిడ్ విషయంలో చైనాపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్న విషయాన్ని గమనించారు. చైనాపై అణు దాడి చేయవచ్చని ఊహించుకుని, గతేడాది అక్టోబర్ 30 న చైనా జనరల్ లీ జూఛెంగ్‌కు ఫోన్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. యుద్ధానికి ఆదేశాలు ఇవ్వొచ్చని చెప్పారు. వెంటనే ప్రతిదాడి చేయవద్దని చైనా జనరల్‌ను కోరారు. మళ్లీ జనవరి 8న చైనా జనరల్‌కు ఫోన్ చేసిన .. ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో దాడికి ఆదేశాలు ఇవ్వొచ్చనే విషయాన్ని వెల్లడించాడు. ఈ విషయంలో సమాచారం తనకు ఆదేశాలు వస్తే ముందే వెల్లడిస్తానని చైనా జనరల్‌కు చెప్పారు. అంతేకాదు కీలక అమెరికా సైనిక జనరల్స్‌ను సమావేశపర్చి ట్రంప్ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని సూచించారు’ అని అందులో పేర్కొన్నారు. ఈ పుస్తకం కోసం గతంలో మార్క్ మిల్లీని రచయిత ఉడ్‌వర్డ్.. ఆయన నైతికంగా నేరస్థుడని అభిప్రాయపడ్డారు. తాజా వ్యవహారంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధ్యక్షుడి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా చైనా జనరల్‌కు మిల్లీ ఫోన్ చేయడం గమనార్హం. మిల్లీ వైఖరిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అఫ్గన్ పరిణామాలు సహా పలు అంశాలపై విచారణ చేపట్టిన రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు సభ్యులుగా సెనెట్ ఆర్మ్‌డ్ సర్వీస్ కమిటీ.. ఫోన్ కాల్స్‌పై మార్క్ మిల్లీని ప్రశ్నించింది. ‘ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడం నా కర్తవ్యం’ అని మిల్లీ వివరణ ఇచ్చారు. అంతేకాదు, ట్రంప్‌నకు అలాంటి ఉద్దేశం లేదనే విషయం తనకు తెలుసునని చెప్పడం విశేషం. తాను ఫోన్ కాల్స్ చేసిన విషయం ట్రంప్ యంత్రాంగంలోని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్కె ఎస్పర్‌లకు తెలుసని చెప్పారు. అదే సమయంలో జనవరి 8 న స్పీకర్ నాన్సీ పెలోసీ ఫోన్‌కాల్ విషయాన్ని కూడా బయటపెట్టారు. అధ్యక్షుడు అణ్వాయుధాలను వాడే సామర్థ్యంపై పెలోసీ కూడా ప్రశ్నించారని చెప్పారు. అణ్వాయుధాల వినియోగానికి ఒక విధానం ఉందని.. దానిని మినహాయించి.. చట్టవిరుద్ధంగా, ప్రమాదవశాత్తు వాటిని ఉపయోగించకుండా చేస్తానని పెలోసీకి చెప్పినట్లు మిల్లీ వివరించారు.
By October 01, 2021 at 09:08AM
No comments