Dhanush: అన్న సెల్వరాఘవన్‌తో మరో ప్రయోగానికి తెరతీసిన హీరో ధనుశ్
తమిళ హీరో అయినప్పటికీ ధనుశ్‌కు ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడీ హీరో తన క్రేజ్‌ను బేస్ చేసుకుని అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా అన్నయ్య , ప్రముఖ సీనియర్ దర్శకుడు సెల్వ రాఘవన్‌తో చేయబోయే మూవీ ‘’ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమేమంటే..తొలిసారి ధనుశ్ హీరోగానూ, విలన్‌గానూ నటించబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ధనుశ్ డ్యూయెల్ రోల్ చేయడం కొత్తేమీ కాకపోయినా, ఇలా విలన్, హీరోగా ఆయనే చేయడం మాత్రం ఫస్ట్ టైమ్. హీరోను ఎంత గొప్పగా చూపిస్తాడో విలన్ క్యారెక్టర్‌ను అంత కంటే గొప్పగా చూపించడం సెల్వ రాఘవన్ అలవాటు. మరి ఈ సినిమాలో ధనుశ్ పాజిటివ్ కోణంలో ఓ వైపు, గ్రేషేడ్స్‌తో మరో కోణంలో ఎలా ఎలివేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గానే మారన్ అనే సినిమాను పూర్తి చేసిన ధనుశ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ‘నానే వరువేన్’ సినిమాను ప్రయోగాత్మకంగా చేస్తున్నాడు. తమిళ దర్శకులతో కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాత తెలుగు దర్శకులు శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరో సినిమాను చేయడానికి ధనుశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందుకనే ఎక్కువగా గ్యాప్ లేకుండా వరుస సినిమాలను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు.
By October 16, 2021 at 09:46AM
No comments