Breaking News

ఇది ఆనందం అనుకోవడం కరెక్ట్‌ కాదు.. ఇకపై అలాగే చేస్తాం!! విష్ణు గెలిచాక మోహన్ బాబు కామెంట్స్ వైరల్


కొన్ని నెలలుగా వాడివేడిగా చర్చల్లో నిలుస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికల అంశానికి ఫుల్‌స్టాప్ పడింది. నిన్న (అక్టోబర్ 10) 'మా' ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడించారు. ప్రకాష్ రాజ్, నడుమ నడిచిన ఈ రసవత్తర పోరులో మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశారు. 'మా' ప్రెసిడెంట్ రేసులో 107 ఓట్ల ఆధిక్యంతో ప్రకాష్ రాజ్‌పై గెలుపు సాధించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. అయితే తొలి నుంచి మంచు విష్ణు వెన్నుముకగా ఉంటూ విష్ణు గెలుపు ఆకాంక్షించిన ఆయన తండ్రి మంచు ఫలితాల అనంతరం ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. 'మా' ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణుకి కృతజ్ఞతలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు చెప్పారు మోహన్ బాబు. ఈ మేరకు తమ భవిష్యత్ ప్రణాళిక, 'మా' గొడవలు లాంటి విషయాలపై ఆయన స్పందించారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. 800లకు పైగా ఉన్న 'మా' సభ్యుల విజయం అని పేర్కొన్న మోహన్ బాబు.. ఇది ఆనందం అనుకోవడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఎన్నికల్లో భయంకరమైన వాగ్దానాలు చేశారని, తన బిడ్డ అన్నీ నెరవేర్చుతారని చెప్పారు. జరిగిందేదో జరిగింది.. ఇక నుంచి అందరం ఒక తల్లి బిడ్డలం అనుకోవాలని పేర్కొన్నారు. తనకు నటుడిగా జన్మనిచ్చిన దాసరి నారాయణరావు గారు ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకున్నారని, ఇకపై 'మా' ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకుంటామని, అలాగే వివాదాలకు దూరంగా ఉంటామని తెలిపారు. గెలుపొందిన సభ్యులు ఎవరూ కూడా ప్రెసిడెంట్‌ అనుమతి లేకుండా మీడియా ముందుకు వెళ్లోద్దని మోహన్ బాబు చెప్పారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా, ట్రెజరర్‌గా శివబాలాజీ, నాగినీడుపై విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన శ్రీకాంత్, బాబూ మోహన్‌పై విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన ఉత్తేజ్‌తో పాటు విష్ణు ప్యానెల్‌కు చెందిన గౌతంరాజు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే విష్ణు మంచు ప్యానెల్‌కు చెందిన 30 ఇయర్స్ పృథ్వీ, మాదాల రవి గెలిచారు. దాదాపు విష్ణు ప్యానెల్ ఈ మా ఎన్నిక‌ల్లో స‌క్సెస్ సాధించింది. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యుల ఫలితాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ముందంజ వేసింది. 18 స్థానాల‌కుగానూ 10 స్థానాల్లో విష్ణు మంచు ప్యానెల్ స‌భ్యులు గెలవగా.. 8 స్థానాల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు గెలిచారు.


By October 11, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-result-mohan-babu-comments-after-manchu-vishnu-victory/articleshow/86926783.cms

No comments