Breaking News

చైసామ్ విడాకులు.. సంచలన నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ.. లోలోపల జరిగింది వేరు!


నాగ చైతన్య, విడాకుల విషయంలో రోజుకో వాదన తెర మీదకు వస్తోంది. మొత్తానికి సమంత మీద ఎన్ని రకాల వార్తలు రాయాలో అన్ని రకాల కథనాలు మీడియా, సోషల్ మీడియా రాసేసింది. అయితే సమంత మాత్రం తన మీద వచ్చిన రూమర్లకు బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. తనకు ఎఫైర్లున్నాయని, ఇది వరకు అబార్షన్లు చేయించుకుందని, పిల్లల్ని వద్దంటోందని, తానొక అవకాశవాది అంటూ వచ్చిన రూమర్లపై సమంత ఫైర్ అయింది. తనను ఇంతలా వ్యక్తిగతంగా అటాక్ చేస్తారా? అంటూ కుమిలిపోయింది. ఇంత వరకు ఈ విడాకుల విషయంలో సమంతదే తప్పు అని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ తాజాగా నిర్మాత చెప్పిన సంచలన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు సమంత మనసులో ఏముందే తెలిస్తే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఓ జాతీయ మీడియా సంస్థతో నీలిమ గుణ సంభాషించింది. దాని ప్రకారం ‘శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదించాం. అయితే అప్పటికే ఆమె చిత్రాలను చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని చెప్పింది. కానీ పీరియాడిక్ సినిమా, కథ నచ్చడంతో ఓకే చెప్పింది. కానీ కొన్ని కండీషన్లు పెట్టింది. త్వరగా షూటింగ్ ఫినిష్ కావాలి. ఎందుకంటే నేను ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇకపై ఇదే చివరి సినిమా అవుతుంది. చాలా రోజులు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారని చెబితే ఓకే చెబుతాను అని అన్నారు. పీరియాడిక్ సినిమా కావడంతో ఆలస్యమవుతుందని భావించారు. కానీ షూటింగ్ త్వరగా పూర్తి చేస్తామని మాటిచ్చాం. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని అన్నారు. అలానే చేస్తామని మాటిచ్చాం’ అని నీలిమ గుణ చెప్పుకొచ్చింది. అంటే సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దంగా చేసుకుంది. కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగింది. అలా చూస్తుంటే సమంత నుంచి ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. అంటే మాధవీలత చెప్పినట్టుగా అక్కినేని ఫ్యామిలీయే ఏదైనా చేసి ఉంటుందా?, వారే ఆమె కలలను చెరిపేశారా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. మొత్తానికి ఈ విడాకుల వెనుకున్న రహస్యాలు మాత్రం ఎప్పుడు బయటకు వస్తాయో ఏమో.


By October 09, 2021 at 07:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/neelima-guna-about-samantha-ruth-prabhu-family-planning/articleshow/86881870.cms

No comments