మళ్లీ మొదటికి వచ్చేసింది.. విడాకుల తర్వాత సోషల్‌మీడియా ప్రొఫైల్ పేరు మార్చేసిన సామ్
గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చకు శనివారం తెరపడింది. ప్రేమించుకొని.. వివాహ బంధంతో ఒకటైన అక్కినేని , సమంతలు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరు కలిసి సోషల్‌మీడియా వేదికగా ఒకే విధమైన ప్రకటనను విడుదల చేశారు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి విడాకుల విషయం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వాళ్లు ఏం పోస్ట్ చేసినా.. అది హైలైట్ అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘అక్కినేని’ అనే పదం తొలగించి చాలాకాలం అయింది. అసలు చై, సామ్‌లు విడిపోవడం గురించి చర్చ ప్రారంభం అవడం ఇక్కడ నుంచే మొదలైంది. అయితే ఆ తర్వాత ఒకరి పోస్ట్‌లపై మరొకరు కామెంట్లు చేయకపోవడం.. ముఖ్యంగా నాగచైతన్య నటించిన లవ్‌స్టోరి సినిమా ఈవెంట్లకు సమంత హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతం ఇచ్చింది. అయితే తాజాగా వాళ్లిద్దరు విడాకులు ప్రకటించడంతో ఈ అనుమానాలకు స్వస్తి పలికినట్లు అయింది. అయితే సమంత విడాకుల తర్వాత మరో ముందడుగు వేసింది. ఇంతకాలం తన కేవలం ‘ఎస్’ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచిన ఆమె. ఇప్పుడు పూర్తిగా ‘సమంత’ అంటూ అప్‌డేట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే.. అధికారిక ప్రకటన కోసమే తన ప్రోఫైల్ పేరును ఇంతకాలం మార్చకుండా సమంత ఆగినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగ చైతన్య, సమంతలు తీసుకున్న నిర్ణయంపై ఓవైపు విమర్శల వర్షం కురుస్తున్న.. మరోవైపు మాత్రం.. ‘ఎవరి ఇష్టాలను బట్టి వాళ్లు జీవించడం సరైనదే.. ఈ క్రమంలో విడాకులు తీసుకోవడం తప్పుకాదు’ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
By October 03, 2021 at 01:20PM
No comments