Breaking News

ఆ డైరెక్ట‌ర్‌కి స‌రెండ‌ర్ అయ్యా... చాలా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అదే దారి అంటున్న బాల‌కృష్ణ హీరోయిన్‌


బ్యూటీ డాల్ తెలుగులో ఇత‌ర హీరోల సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆమెకు స‌రైన గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేసిన లెజెండ్‌, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాల‌నే చెప్పాలి. సొగ‌సుల‌ను ఆర‌బోయ‌డంలో ఏమాత్రం రెండో ఆలోచ‌న‌కు తావీయ‌ని ఈ సొగ‌స‌రి ఇప్పుడు వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహరీన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఎఫ్‌3లో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ సినిమా విష‌యంలో తాను డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడికి స‌రెండ‌ర్ అయ్యాన‌ని చెప్పింది. అలాగే వ్య‌క్తిగ‌తంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల కోసం ఆమె ఏం చేస్తుంద‌నే సీక్రెట్‌ను కూడా రివీల్ చేసింది. సోనాల్ చౌహాన్‌ అసలెందుకు అలా చెప్పింద‌నే విష‌యాన్ని విష‌యంలోకి వెళితే.. ఎఫ్‌3లో ఆల్ రెడీ ఇద్ద‌రు మంచి పేరున్న, గ్లామ‌ర్‌ హీరోయిన్స్ ఉన్నారుగా, మ‌రి ఇవిడ‌కి ఆ సినిమాలో పాత్ర ఎలా ఉండ‌బోతుందో అనే సందేహం రాక‌మాన‌దు. అది తెలియాలంటే డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి చెప్పాలి.. లేదా సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. ఇదే విష‌యాన్ని సోనాల్ చౌహాన్‌ను అడిగితే మాత్రం అమ్మో సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోందండి.. ఆ విష‌యాన్ని నేను చెప్పలేను అని హోయ‌లు పోతోంది మ‌రి. ఇంకా ఎఫ్ 3 గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘ నేను ఎఫ్2 సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. అయితే ఎఫ్ 3లో భాగ‌మ‌వుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్3లో న‌టించాల‌ని న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు నాకు చాలా ఆనంద‌మేసింది. అయితే ఇందులో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాన‌ని చెప్ప‌గ‌ల‌ను. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఫుల్ ప్లెజ్డ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో న‌టిస్తున్నాను. ఇది వ‌ర‌కు నేను చేసిన చిత్రాల్లో పాత్ర‌ల‌కు ఈ పాత్ర పూర్తి భిన్న‌మైన‌ది. అనీల్ రావిపూడితో పాత్ర ప‌రంగా ముందుగానే చ‌ర్చించాను. న‌టిగా ఆయ‌న‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అయ్యాను. ఆయ‌న సల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తున్నానంతే’’ అన్నారు. మరో ఆరోగ్యం గురించి చెబుతూ ‘‘మనలో చాలా మందికి ఉండే ఆరోగ్య సమస్యలకు యోగ చేడయమే మంచి మందు. నేను అవిడ్ యోగ చేస్తుంటాను. ఆ ఫొటోను నా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుంటాను. యోగ నా జీవితంలో ఓ భాగమైపోయింది’’ అని అసలు సీక్రెట్ చెప్పేసింది మరి. 2008లో జన్నత్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సోనాల్‌కు అవ‌కాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే ఆమె వ‌చ్చిన అవ‌కాశాల‌ను చ‌క్క‌గానే ఉప‌యోగించుకుంటోంది. గ్లామ‌ర్ ప‌రంగా పోటీప‌డుతూ అందాల విందు చేస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌కు మ‌రి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఎఫ్ 3 సినిమా ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మ‌రి.


By October 24, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-sonal-chauhan-about-anil-ravipudi-and-role-in-f3/articleshow/87232838.cms

No comments