అక్కినేని అభిమానులు గర్వంగా ఉండండి.. మంచి రోజులు వస్తాయి.. అఖిల్ కామెంట్స్ వైరల్
దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా '' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని అఖిల్- జంటగా నటించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించారు. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. వేదికపై అక్కినేని అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. ''ముందుగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి వచ్చినందుకు మీ అందరికీ థాంక్స్. నేను ముఖ్యంగా అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో పని చేయడం నా అదృష్టం. మా నాన్నకు ప్రామిస్ చేయడమే కాకుండా మీరు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా. మీ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండగా నన్ను ఇలా చూసుకున్నారంటే మీ తత్త్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' టీమ్ అంతా నిజాయితీగా, ఓ టీమ్‌గా పని చేశాం. ఒక మంచి కథతో ఫ్యామిలీస్‌కి, యూత్‌కి మంచి మెసేజ్ ఇవ్వడమే కాకుండా కొన్ని సమస్యలకు సొల్యూషన్స్ ఇద్దామని అనుకున్నాం. అలా ఈ దసరాకు మీ ముందుకు వచ్చాము. ఈ సక్సెస్ మాకిచ్చినందుకు థ్యాంక్స్. దీంతో నేను హిట్టు కొట్టానని అనుకోవడం లేదు.. మీరు ఈ రూపంలో ఓ గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ తీసుకొని ఇంకా ముందుకెళదామని అనుకుంటున్నా. బన్నీ వాసు, వాసు వర్మ, బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు పిల్లర్స్‌గా నిలుచున్నారు. అరవింద్ గారు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాం. విభా అనే క్యారెక్టర్‌లో పూజా చాలా బాగా చేసింది. నీతో మళ్ళీ చేయాలని ఉంది పూజా. ఇకపోతే ఈ వేడుకకు వచ్చినందుకు బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు చేస్తున్న 'పుష్ప' సినిమాకి ఆల్ ది బెస్ట్. అక్కినేని అభిమానులు గర్వంగా ఉండండి. మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేంతవరకు నిద్రపోను. మంచి రోజులు వస్తాయి. ఇక్కడికి వచ్చి మా సక్సెస్‌ని మాతో సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులందరికీ సెల్యూట్'' అన్నారు.
By October 20, 2021 at 06:39AM
No comments