Breaking News

డీఎన్ఏ టెస్ట్‌కు బలవంతపెట్టడం గోప్యత హక్కు ఉల్లంఘనే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు


డీఎన్‌ఏ పరీక్ష సాధారణ విషయం కాదని, అర్హత ఉన్న కేసుల్లో మాత్రమే చేయించుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల , గోప్యత హక్కులను ఉల్లంఘించడమేనని శుక్రవారం వ్యాఖ్యానించింది. సంబంధాన్ని రుజువు చేయడానికి లేదా వివాదాస్పదం చేయడానికి ఇతర సాక్ష్యాలు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా కోర్టు రక్త నమూనా పరీక్షలకు ఆదేశించడం మానుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘డీఎన్ఏ అనేది ఒక వ్యక్తికి (కవలలను మినహాయించి) ప్రత్యేకమైంది.. ఒక వ్యక్తి గుర్తింపును తెలుసుకోడానికి, కుటుంబ సంబంధాలను గుర్తించడానికి లేదా సున్నితమైన ఆరోగ్య సమాచారాన్ని బహిర్గతం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. ‘ కోసం రక్త నమూనాలను ఇవ్వాలని ఒక వ్యక్తిని బలవంతం చేయవచ్చా అనే దానిపై కూడా కేఎస్ పుట్టస్వామి Vs కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో తీర్పునిచ్చింది.. ఈ దామాషా పరీక్షను పరిగణనలోకి తీసుకుని ఇది రాజ్యాంగపరంగా లభించిన గోప్యత హక్కుగా ప్రకటించింది’ అని ధర్మాసనం తెలిపింది. ‘న్యాయస్థానాలు చట్టబద్ధమైన లక్ష్యాల నిష్పత్తిని పరిశీలించాలి.. ఏకపక్షంగా లేదా వివక్షతో కూడుకుని ఉండకూదడు.. డీఎన్ఐ పరీక్ష వ్యక్తిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.. వారి వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని ప్రభావితం చేస్తాయి.. వాది ఇష్టపూర్వకంగా DNA పరీక్షకు అంగీకరించకుండా బలవంతం చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతా హక్కును దెబ్బతీస్తుంది’ అని అన్నారు. ఆస్తిపై హక్కును కోరుతూ అశోక్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం ఈ తీర్పునిచ్చింది. త్రిలోక్ చంద్ గుప్తా, ఆయన భార్య సోనా దేవి దంపతుల ముగ్గురు కుమార్తెలను సూట్‌లో ప్రతివాదులుగా చేర్చుతూ.. తాను వారిని కుమారుడ్నిని పేర్కొన్నాడు. అయితే, అతడికి తమతో ఎటువంటి రక్తసంబంధం లేదని ప్రతివాదులు వాదించారు. ఈ సమయంలో అశోక్‌ను డీఎన్ఐ పరీక్షకు అనుమతించాలని కోరడంతో అతడు నిరాకరించాడు.


By October 02, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/forcing-dna-test-infringes-personal-liberty-right-to-privacy-says-supreme-court/articleshow/86699512.cms

No comments