Breaking News

వైట్‌హౌస్ యంగ్ ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు


అమెరికా సోమవారం ప్రకటించిన యంగ్ ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత సంతతికి చెందిన ముగ్గురికి చోటుదక్కింది. ప్రతిష్ఠాత్మకమైన కింద వైట్ హౌస్ సిబ్బంది, క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులలో విభిన్న నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాదికి గానూ 19 మందిని ఎంపిక చేయగా.. వారిలో కాలిఫోర్నియాకు చెందిన జోయ్ బసు, సన్నీ పటేల్, న్యూజెర్సీకి చెందిన ఆకాశ్ షాలు ఉన్నారు. ఈ ఫెలోషిప్‌ను 1964లో అప్పటి అమెరికా అధ్యక్షఉడు లిండన్ బి జాన్సన్ ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఎంపికైనవారు షెలోషిప్ చరిత్రలో అత్యంత వైవిధ్యమైన తరగతిగా వైట్‌హౌస్ ప్రెసిడెంట్స్ కమిషన్ అభివర్ణించింది. జోయ్ బసు వైట్‌హౌస్‌ జెండర్ పాలసీ కౌన్సిల్‌లో పనిచేస్తుండగా.. గతంలో ఆమె ఇన్నోవేటివ్ వ్యాపార విభాగంలో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. టీపీజ గ్రోత్‌లో పనిచేసి ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన తొలి వ్యక్తి కూడా ఈమే కావడం విశేషం. టీపీజీలో ఆహారం, వ్యవసాయం కోసం నిధుల సేకరణ విభాగం చీఫ్‌గా కూడా పనిచేశారు. అంతకు ముందు జాయ్ మెకిన్సే అండ్ కంపెనీలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో ఆహార వ్యవస్థలను మెరుగుపరచడానికి వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు, దాతలతో కలిసి వ్యవసాయ అభివృద్ధిపై దృష్టిసారించారు. ప్రపంచ ఆర్ధిక ఫోరమ్‌లోనూ ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, పబ్లిక్ మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ ఇన్నోవేషన్‌లో సర్టిఫికెట్ కోర్టు చేశారు. అక్కడ స్టాన్‌ఫర్డ్ మహిళ లా విభాగం సహాయ అధ్యక్షురాలిగానూ ఉన్నారు. సన్నీ పటేల్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగంలోని చిన్న పిల్లల సైక్రియాటిస్ట్‌, పబ్లిక్ హెల్త్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. పిల్లలు, కుటుంబాలకు సేవ చేసే సమానమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఫెలోషిప్ పూర్తచేశారు. కోవిడ్-19 సమయంలో వేలాది మంది ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకాశ్ షా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగంలో వైద్యుడిగా కొనసాగుతున్నారు. హాకెన్‌సాక్ మెరేడియన్ హెల్త్ ఎమర్జెన్సీ విభాగం డాక్టర్‌గా కోవిడ్ సమయంలో బాధితులకు చికిత్స అందజేశారు. జెర్నీ షోర్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అడిక్షిన్ మెడిసిన్ డైరెక్టర్‌, హీల్ ప్రాజెక్ట్ మెడికల్ డైరెక్టర్‌గా సేవలు చేస్తున్నారు.


By October 19, 2021 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-indian-americans-selected-in-white-house-fellowship-programme/articleshow/87126703.cms

No comments