డ్రామాలు దొబ్బకండి.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా?.. పూరి కొడుకుపై సీరియస్ అయిన ప్రభాస్
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మన టాలీవుడ్ హండ్‌సమ్ హంక్ ప్రభాస్‌కు కోపం వచ్చిందా? ఏంటి ఎప్పుడూ నవ్వుతూ కూల్‌గా ఉండే ప్రభాస్‌కు కోపం తెప్పించిందెవరా? అని ఆలోచిస్తే.. సాధారణంగా తన సినిమా షూటింగుల నుంచి దొరికిన గ్యాప్‌ను తన స్నేహితుల కోసం వెచ్చించారు. అందుకనే అంటారు ప్రభాస్‌ని అందరూ డార్లింగ్ అని. అసలు ఇంతకీ ప్రభాస్ అంతలా చేసిన పనేంటి? అంటే పూరి జగన్నాథ్ కొడుకు , హీరోయిన్ కేతికా శర్మను ‘రొమాంటిక్’ సినిమా కోసం ఇంటర్వ్యూ చేశారు ప్రభాస్. మామూలుగా తన సినిమాలకే మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇబ్బంది పడే ప్రభాస్ అసలు రొమాంటిక్ టీమ్‌ను ఎందుకు ఇంటర్వ్యూ చేశారంటే.. ఇంకెందుకు.. ఇంతకు ముందు చెప్పినట్లు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఉన్న పరిచయం కారణంగా. ప్రభాస్ హీరోగా పూరి రెండు సినిమాలు చేశారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, ఏక్ నిరంజన్. ఈ సినిమాలు జయాపజయాలను పక్కన పెడితే, ప్రభాస్‌ను మాస్‌లో చాలా మంచి ఇమేజ్ వచ్చింది. అప్పటి నుంచి పూరి అంటే ప్రభాస్‌కు ప్రత్యేకమైన అభిమానం. అందువల్లనే పూరీ జగన్నాథ్ నిర్మాణంలో ఆయన శిష్యుడు అనిల్ పడూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్ .. హీరో హీరోయిన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంలో సినిమా షూటింగ్ గోవాలో జరిగిందని తెలుసుకుని అక్కడ ఏమేం చూశారో చెప్పమని ప్రభాస్ ఆకాశ్‌ను, కేతికా శర్మను అడిగితే షూటింగులో గ్యాపే లేదు అన్నారు. మరి ఇష్టమైన తిండి గురించి మాట్లాడేటప్పుడు.. గోవాలో ఏ హోటల్లో ఏ నాన్ వెట్ బావుంటుందనే విషయాన్నిఆకాశ్ పూరి వివరించాడు. అప్పుడు ప్రభాస్.. డ్రామాలు దొబ్బకండి..ఇంతకు ముందు అడిగితే షూటింగ్‌కే పరిమితం అయ్యాం. ఖాళీయే లేదు అన్నారుగా.. ఇప్పుడేంటి ఇలా ఇన్ని చెబుతున్నారు? పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అంటూ సీరియస్ అయ్యారు. కానీ అది కూడా తమాషాకే. ఈ సందర్భంలో సినిమా బావుంటే అందరి హీరోల ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారని, రొమాంటిక్ సినిమా బావుండాలని, పెద్ద హిట్ కావాలని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్. సినిమా దర్శకుడు అనిల్ పడూరి గురించి, సినిమాలో కీలక పాత్ర చేసిన రమ్యకృష్ణగారి గురించి అడిగి మరీ తెలుసుకున్నారు ప్రభాస్.
By October 26, 2021 at 11:43PM
No comments