Breaking News

కొవాగ్జిన్‌పై డేటా వేగంగా అందుతోంది.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన


వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం అవసరమైన సమాచారాన్ని చాలా వేగంగా అందజేస్తోందని డబ్ల్యూహెచ్ఓ‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. వ్యాక్సిన్‌కు ఆమోదంపై టెక్నికల్ కమిటీ వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనుందని ఆ అధికారి పేర్కొన్నారు. అత్యంత నాణ్యత కలిగిన టీకాలను భారతీయ సంస్థలు ఉత్పత్తి చేస్తాయని బలంగా నమ్ముతున్నామని ఆమె వ్యాఖ్యానించారు. కొవాగ్జిన్ ఈయూఎల్ కోసం భారత్ బయోటెక్ ఈ ఏడాది ఏప్రిల్ 10న దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టీకా ఆమోదం విషయంలో మంగళవారం సమావేశమైన డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక నిపుణుల బృందం.. భారత్ బయోటెక్ నుంచి అదనపు స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మారియాంజిలా సిమాన్ మాట్లాడుతూ.. ‘భారత్ క్రమం తప్పకుండా, చాలా త్వరగా డేటాను అందజేస్తోందని చెప్పగలను.. అయితే చివరిగా డేటాను అక్టోబర్ 18న సమర్పించారు’ అని ఆమె పేర్కొన్నారు. కొవాగ్జిన్‌కు ఈయూఎల్‌ జాప్యంపై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘అక్టోబరు 26న సమావేశమైన సాంకేతిక నిపుణుల బృందం.. భారత్ బయోటెక్ నుంచి అదనపు స్పష్టత కోరింది.. నవంబరు 2న సమావేశమై కొవాగ్జిన్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని సిమాన్ తెలిపారు. అంతేకాదు, అదనపు సమాచారం కోసం తరుచూ భారత్ బయోటెక్ ప్రతినిధులతో సంప్రదింపులు, సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఏ నిర్దిష్ట తయారీదారు గురించి ప్రస్తావించకూడదనుకుంటున్నాను.. కానీ మేము ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ తయారీదారుని అంచనా వేశాం.. దీనికి 30 రోజులు పట్టిందని స్పష్టం చేస్తున్నాను’ అని కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి వ్యాఖ్యానించారు. ‘కాబట్టి ఇది ఒకటి లేదా మరొక వ్యాక్సిన్‌తో వేగంగా అనుమతించడం గురించి కాదు...మేము నిజంగా భారతీయ పరిశ్రమను విశ్వసిస్తాం... ప్రపంచంలోని వివిధ మెజారిటీ, అధిక నాణ్యత కలిగిన వ్యాక్సిన్‌లను భారత్ ఉత్పత్తి చేస్తుంది.. మేము ప్రస్తుతం దీని ద్వారా అంచనా వేయడానికి చివరి దశలో ఉన్నాం... సాంకేతిక సలహా బృందం వచ్చే వారం WHOకి తుది సిఫార్సు చేస్తుందని మేము ఆశిస్తున్నాం.. దీనిని అవగాహన చేసుకుంటారనుకుంటున్నాం’ అని అన్నారు.


By October 29, 2021 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-biotech-submitting-data-regularly-very-quickly-says-who-official-on-covaxin/articleshow/87353693.cms

No comments